రవితేజ & చైతు ఎప్పుడు వస్తున్నారో చెప్పేశారు

By iQlikMovies - August 12, 2018 - 11:11 AM IST

మరిన్ని వార్తలు

మాస్ మహారాజ రవితేజ చాలా కాలం తరువాత దర్శకుడు శ్రీను వైట్ల తో కలిసి చేస్తున్న చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ USAలో జరుగుతున్నది. ఇక నిన్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా అక్టోబర్ 5న విడుదలకానున్నట్టు ప్రకటించారు.

ఇదే సమయంలో నాగ చైతన్య చిత్రం సవ్యసాచి సంబంధించిన విడుదల తేదీ వివరాలు కూడా మైత్రి వారు ప్రకటించేశారు. దీనితో ఈ చిత్రం షూటింగ్ పై ఉన్న సందేహాలకి చెక్ పడింది, ఇంతకి ఈ చిత్రం విడుదలవుతుంది ఎప్పుడంటే- నవంబర్ 2.

ఇలా తమ నిర్మాణ సంస్థలో నిర్మితమవుతున్న రెండు భారీ చిత్రాల గురించి విడుదల తేదీలు ప్రకటించడం ఒకరకంగా ఈ రెండు సినిమాలకి సంబందించిన ప్రొమోషన్స్ ని పరోక్షంగా మొదలుపెట్టేశారు అని అనుకోవచ్చు.

మొత్తానికి ఈ రెండు చిత్రాలు తమ రాకని అక్టోబర్, నవంబర్ లో ఫిక్స్ చేసేశాయ్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS