వరుస ఫ్లాపులు రవితేజని ఉక్కిరి బిక్కిరి చేశాయి. నేల టికెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ... డిజాస్టర్లు మరింత ఇబ్బంది పెట్టాయి. నిజానికి ఈఫ్లాపులతో రవితేజ కి మరో సినిమా దొరక్కూడదు. కానీ అదేంటో తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా ఈసారి యమ బిజీగా మారిపోయాడు. తన చేతినిండా సినిమాలే. హిట్టు కొట్టకపోయినా రవితేజ కి ఇన్ని సినిమాలు ఎలా వచ్చి చేరిపోతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే.. రవితేజ మాత్రం అజాగర్తతో ఉండడం లేదు.
తనకు ఓ మంచి హిట్టు పడితే, తన కెరీర్ మరింత స్పీడుగా దూసుకుపోతుందని తనకు తెలుసు. అందుకే క్రాక్ సినిమాపై చాలా కేర్ తీసుకుంటున్నాడట. ఈసినిమాని ఎలాగైనా హిట్ చేయాలని భావిస్తున్నాడట. అందుకే ఎడిట్ రూమ్ లోనూ కూర్చుని ఫైనల్ కట్ ఎలా ఉండబోతోందన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడట. ఈ సినిమా రషెష్ చూసిన రవితేజకు, కొన్ని సీన్లు రీషూట్ చేయాలని అనిపించిందని సమాచారం. దాంతో.. ఇప్పుడు ఆ పనులు మొదలెట్టార్ట, ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. కాబట్టి... కావల్సినంత సమయం ఉన్నట్టే. అందుకే.. జాగ్రత్తగా రిపేర్లు మొదలెట్టారు.