పోలీస్ పాత్ర‌లో 'క్రాక్‌' పుట్టిస్తాడ‌ట‌!

By Gowthami - October 26, 2019 - 14:00 PM IST

మరిన్ని వార్తలు

ర‌వితేజ పోలీస్ గా న‌టించిన సినిమాల‌న్నీ దాదాపు హిట్టే. అందులో `విక్ర‌మార్కుడు` సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌య్యింది. 'ప‌వ‌ర్‌' కూడా ర‌వితేజ ప‌వ‌ర్‌ని చూపించింది. ఇప్పుడు మ‌రోసారి ఖాకీ యూనిఫామ్ వేయ‌బోతున్నాడు ర‌వితేజ‌. త‌ను క‌థానాయ‌కుడిగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌. ఇది వ‌ర‌కు ఈ ముగ్గురి కాంబినేష‌న్‌లో బ‌లుపు వ‌చ్చింది.

 

ఓ ర‌కంగా ఇది బ‌లుపు 2 అన్న‌మాట‌. ఈ చిత్రానికి `క్రాక్‌` అనే పేరు ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇందులో కూడా ర‌వితేజ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ని పోషిస్తున్నాడు. ప్ర‌స్తుతం డిస్కోరాజా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు ర‌వితేజ. ఆ త‌ర‌వాత సెట్స్‌పైకి వెళ్ల‌బోయే సినిమా ఇదే. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన కొత్త విష‌యాలు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. టైటిల్‌ని కూడా ఈ రోజే ఫిక్స్ చేయొచ్చ‌ని స‌మాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS