ఆయనది 30 ఇయర్స్ ఇండ్రస్ట్రీ. చాలా హిట్లు చూశాడు. యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన వారసులు కూడా ఇప్పుడు సినీ రంగంలోనే ఉన్నారు. గత కొన్నేళ్లుగా తనకు హిట్లు లేవు. సినిమాలూ తక్కువే. సొంత బ్యానర్లో సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న సందర్భాలు ఎన్నో. దాంతో ఆస్తులన్నీ హారతి కర్పూరంగా కరిగిపోయాయి. ఇటీవలే ఓ హిట్టు కొట్టి, కాస్త తెరిపిన పడ్డాడు. కానీ ఆ వెంటనే మరో ఫ్లాపు వచ్చింది. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమా కూడా జారిపోయింది. దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి.
అప్పులు, వడ్డీలు ఎక్కువయ్యాయి. ఈ హీరోకి దాదాపు 50 కోట్ల వరకూ అప్పులున్నాయని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. తనకున్న ఆస్తులన్నీ అమ్మేసినా, ఈ అప్పులు తీరవని టాక్. దాంతో... కాస్త డిప్రెషన్కి గురయ్యాడట. హీరోగారిని డిప్రెషన్ నుంచి దూరం చేయడానికి ఆ ఇంట్లో వాళ్లు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావట. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ హీరో గురించే చర్చ నడుస్తోంది. ఒకట్రెండు సినిమాలు హిట్టయి, అవకాశాలు పెరిగితే.. అప్పులు తీరే దారి దొరుకుతుంది. వారసులు కూడా హిట్లందుకుంటే కాస్త ఒడ్డున పడొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.