రామారావు ఆన్ డ్యూటీ రవితేజ ఫ్యాన్స్ ని చాలా నిరాశ పరిచింది. డిజాస్టర్ గా నిలిచింది. మాస్ మహారాజా ఎలెమెంట్స్ ఇందులో మిస్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ లో జోష్ నింపింది ‘ధమాకా’. రవితేజ , నక్కిన త్రినాథరావు కాంబినేషన్ లో తెరకెక్కించిన చిత్రమిది. శ్రీలీల కథానాయిక. తాజాగా విడుదలైన టీజర్ అభిమానులని అలరించింది.
‘‘నేను మీలో విలన్‌ను చూస్తే.. మీరు నాలో హీరోని చూస్తారు. కానీ, నేను యాక్షన్‌లో ఉన్నప్పుడు శాడిస్ట్‌ని’’ అంటూ రవితేజ ఇంగ్లీష్‌లో చెప్పిన డైలాగ్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సినిమాలో ఆయన రెండు కోణాలున్న పాత్రలో సందడి చేయనున్నారు. ఇందులో యాక్షన్‌కు పెద్ద పీట వేసినట్లు టీజర్ లో కనిపించిన సన్నివేశాల్ని బట్టి అర్థమవుతోంది. ‘‘అట్నుంచి ఒక బుల్లెట్ వస్తే.. ఇట్నుంచి దీపావళి’’ అంటూ ఆఖర్లో రవితేజ చెప్పిన డైలాగ్ టీజర్‌కు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో డిసెంబర్ 23న విడుదల కానుంది.