నటీనటులు: విశ్వక్ సేన్, వెంకటేష్, మిథిలా పాల్కర్, ఆశా భట్
దర్శకత్వం : అశ్వత్ మరిముత్తు
నిర్మాతలు: పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీ: విధు అయ్యన
ఎడిటర్స్: విజయ్ ముక్తవరపు
రేటింగ్: 2.75/5
తమిళంలో విజయవంతమైన చిత్రం 'ఓ మై కడవులే'. రొమాంటిక్ కామెడీ ఫాంటసీ ఎంటర్ టైనర్ గా అక్కడ ప్రేక్షకులని ఆకట్టుకుంది ఈ సినిమా. ఇప్పుడు అదే సినిమాని తెలుగులో విశ్వక్‌సేన్ రీమేక్ చేశారు. మాతృక తీసిన అశ్వత్ మారిమత్తు ఈ రిమేక్ కీ దర్శకత్వం వహించాడు. మరి తమిళనాట జరిగిన మ్యాజిక్ తెలుగులోనూ కనిపించిందా? ఈ రీమేక్ విశ్వక్ కి ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది ? ఇంతకీ ఏమిటీ 'ఓరి దేవుడా' కథ.
కథ:
అర్జున్ (విశ్వక్ సేన్), అను (మిథిలా పాల్కర్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. అను ఇష్టపడటంతో అర్జున్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అయితే అనులో.. ఫ్రెండ్ ని తప్ప, భార్యని చూడలేకపోతాడు అర్జున్. పెళ్లి లైఫ్ చాలా త్వరగా బోర్ కొట్టేస్తుంది. దాంతో ఇద్దరూ విడాకులకు సిద్ధం అవుతారు. అనుని ఎందుకు పెళ్లి చేసుకొన్నాను దేవుడా..? ప్రేమ పెళ్లి విషయంలో తనకి సెకండ్ ఛాన్స్ ఇవ్వమని కోరుకుంటాడు అర్జున్. నిజంగానే దేవుడు(వెంకటేష్) దిగి వచ్చి అర్జున్‌కి కొన్ని కండిషన్స్‌తో సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. సెకండ్ ఛాన్స్ తో అర్జున్ ఏం చేశాడు ? మీరా (ఆశా భట్) ఎవరు ? అను-అర్జున్ కథ చివరికి ఏమైయింది ? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
'ఓ మై కడవులే' సినిమాలో ఒక మ్యాజిక్ వుంది . ఓ ప్రేమకథలో స్నేహాన్ని మిక్స్ చేసి, దేవుడ్ని తీసుకొచ్చి ఫిలాసఫీ టచ్ ఇచ్చి మ్యాజిక్ చేశాడు దర్శకుడు. ఈ ట్రీమ్‌మెంట్ అందరికీ నచ్చింది. ఆ మ్యాజిక్ 'ఓరి దేవుడా' లో కూడా వర్క్ అవుట్ అయ్యింది. చాలా సింపుల్ లైన్ ఇది జీవితాల్లో రెండో అవకాశం గురించి అలోచించడం ఒక ఫాంటసీ. దాన్ని ఈ కథలో మిక్స్ చక్కగా మిక్స్ చేసి ప్రేక్షకులకు ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఇవ్వగలిగాడు దర్శకుడు.
తమిళం వెర్షన్ ఎలాంటి మార్పులు చేయకుండా అదే ఫీల్ ని తెలుగు ప్రేక్షకులకు చక్కగా ఇవ్వగలిగారు. చాలా స్పీడ్ గా కథలోకి వెళ్ళిపోయాడు దర్శకుడు. మొదటి అరగంటలోస్నేహం పెళ్లి, విడాకులు తంతు చకచక నడిచిపోతాయి. ఇంటర్లో బ్లాక్ కథలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ద్వితీయార్ధంలో మీరాతో నడిపిన లవ్ ట్రాక్ చాలా ఫ్రెష్ గా వుంది. కేరళ ఎపిసోడ్ కాస్త బోరింగా ఉన్నప్పటికీ కథలో ఎమోషన్ కి ఉపయోగపడింది. చివర్లో అను - అర్జున్ మధ్య సీన్స్ ఆకట్టుకుంటాయి. 'నీకు చెప్పినా అర్థం కాదురా..' సీక్వెన్స్ నవ్వులు పూయిస్తుంది. టోటల్ గా సినిమా ఒక డీసెంట్ ఎంటర్ టైనర్ అనే ఫీలింగ్ కలిగిస్తుంది.
నటీనటులు :
విశ్వక్ సేన్ ఎనర్జీ స్క్రీన్ ప్రజన్స్ ఈ సినిమాలో మరింతగా ఆకట్టుకుంటుంది. అర్జున్ పాత్రని చాలా సహజంగా చేశాడు. ఇక వెంకటేష్ పాత్ర ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దేవుడిలా కనిపించడం వెంకీ ఇమేజ్ కే చెల్లింది. తననదైన బాడీ లాంగ్వేజ్ తో ఆ పాత్రని పండించాడు వెంకీ.
మిథిలా పాల్కర్, ఆశాభట్ పాత్రల్లో ఒదిగిపోయారు. మీరా పాత్రలో కనిపించిన ఆషాభట్ హుందాగా నటించింది. వెంకటేష్ కాకుమాను, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ, నాగినీడు తదితరులు పాత్రల పరిధిమేరకు వున్నాయి.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా సినిమా ఉన్నతంగా ఉంది. కెమెరా, సంగీతం నీట్ గా వున్నాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు వున్నాయి. ప్రధమార్ధంలో ఇంకాస్త కామెడీని జోడించే అవకాశం వున్నా దర్శకుడు ఆ ఛాన్స్ తీసుకోలేదు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ కొన్ని ఆకట్టుకుంటాయి.
ప్లస్ పాయింట్స్
విశ్వక్ సేన్
కథా నేపధ్యం
ఎమోషన్
మైనస్ పాయింట్స్
కొన్ని సాగదీత సన్నివేశాలు
హాస్యం మోతాదు తగ్గడం
ఫైనల్ వర్దిక్ట్ : దేవుడి మ్యాజిక్