సంక్రాంతి నుంచి ఈగ‌ల్ ఔట్‌: డీజే టిల్లు పై ఎఫెక్ట్‌

మరిన్ని వార్తలు

ఈ సంక్రాంతికి రావాల్సిన 'ఈగ‌ల్' వెన‌క్కి వెళ్లింది. పండ‌క్కి 5 సినిమాలొస్తే... థియేట‌ర్లు దొర‌క‌వ‌ని, ఓ సినిమా వాయిదా ప‌డితే మంచిద‌ని ప్రొడ్యూస‌ర్ గిల్డ్ కోరిన నేప‌థ్యంలో 'ఈగ‌ల్‌' టీమ్ ఈ నిర్ణ‌యం తీసుకొంది. ఈనెల 13న రావాల్సిన 'ఈగ‌ల్' ఇప్పుడు ఫిబ్ర‌వ‌రి 9న వ‌స్తోంది. 'ఈగ‌ల్' వాయిదా ప‌డ‌డంతో మిగిలిన 4 సినిమాల‌కూ మేలు జ‌రిగిన‌ట్టే. కాక‌పోతే.. ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కావాల్సిన 'టిల్లు స్క్వేర్‌'పై ఈ ఎఫెక్ట్ ప‌డ‌బోతోంది.


'టిల్లు స్క్వేర్‌' 2023 డిసెంబ‌రులో రావాల్సింది. కాక‌పోతే.. సోలో రిలీజ్ కోసం ఫిబ్ర‌వ‌రి 9కి వాయిదా ప‌డింది. ఇప్పుడు 'ఈగ‌ల్' టీమ్‌... అదే డేట్ కోరుతోంది. సంక్రాంతి నుంచి త‌ప్పుకొంటే.. సోలో రిలీజ్ వ‌చ్చేలా చూస్తామ‌ని గిల్డ్ మాట ఇచ్చిన నేప‌థ్యంలో ఇప్పుడు టిల్లు 'ఈగ‌ల్' కోసం దారి ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. 'టిల్లు స్క్వేర్‌'కి నిర్మాతైన నాగ‌వంశీ... 'గుంటూరు కారం'తో సంక్రాంతి బ‌రిలో నిలిచారు. 'ఈగ‌ల్‌' వాయిదా ప‌డ‌డంతో 'గుంటూరు కారం'కి ఎంతో కొంత అడ్వాంటేజీ ఏర్ప‌డింది. దాంతో ఆయ‌న టిల్లుని వాయిదా వేసుకోవ‌డానికి సుల‌భంగానే అంగీక‌రించారు. కాక‌పోతే.. అదే రోజున 'యాత్ర 2' కూడా విడుద‌ల కానుంది. ఆ సినిమాని కూడా ప‌క్క‌కు త‌ప్పిస్తారా?  'యాత్ర 2'ని 'ఈగ‌ల్'  లైట్ తీసుకొంటుందా? అనేది వేచి చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS