మహేష్- జక్కన్నలతో ప్రియాంక?

మరిన్ని వార్తలు

రాజమౌళి, మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేసి అందరి ద్రుష్టి తనవైపు తిప్పుకున్నాడు. అసలు మహేష్ , రాజమౌళి సినిమా అనగానే ఈ క్రేజీ కాంబినేషన్ పై ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇక అప్పటినుంచి ఈ మూవీ నుంచి ఏ అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరలవుతోంది.  ఈ మూవీ వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది అని తెలియటంతో అంచనాలు పీక్స్ కి చేరాయి.


ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో  హీరోయిన్ ఎవరన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కొన్ని సార్లు దీపికా పేరు కూడా వినిపిస్తోంది. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో ప్రియాంక చోప్రా నటించనున్నట్లు ఫిల్మ్ వర్గాల టాక్. ఇప్పటికే రాజమౌళి ఈ గ్లోబర్ స్టార్ ని సంప్రదించినట్టు సమాచారం. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. 


ప్రియాంక ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోందా? కీలక పాత్రా? అని తెలియాల్సి ఉంది.  41 ఏళ్ళ వయసులో ప్రియాంక హీరోయిన్ ఏంటని కొందరు పెదవి విరుస్తున్నారు. బాలీవుడ్ సినిమాల్లోనే దాదాపు ప్రియాంక కి హీరోయిన్ ఛాన్స్ లు రావటం లేదు. ఇలాంటి దశలో జక్కన్న ప్రియాంకని మహేష్ పక్కన హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ లేదని, ఏదైనా కీలక పాత్రకి గాను ప్రియాంకని సంప్రదించి ఉండొచ్చు అని టాక్.  మార్చి నెలలో ఈ షూటింగ్ పట్టాలెక్కనున్న క్రమంలో జనవరి ఎండింగ్ లోపే జక్కన్న ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ ఉంది. అప్పుడు మిగతా విషయాలు తెలియనున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS