మాస్‌రాజా మనసు దోచుకున్న ఇస్మార్ట్‌ బ్యూటీ!

మరిన్ని వార్తలు

'నన్ను దోచుకుందువటే..' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్‌ చెప్పిన ముద్దుగుమ్మ నభా నటేష్‌. తర్వాత పూరీ జగన్నాధ్‌ దృష్టిలో పడింది. 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో ఛాన్స్‌ కొట్టేసింది. ఇక అక్కడితో నభా దశ తిరిగిపోయింది. వరుస ఆఫర్లు అందుకుంటూ, ఫుల్‌ జోష్‌ మీదుంది. నభా నటేష్‌ నటించిన 'డిస్కో రాజా' చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్‌ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నభా నటేష్‌తో పాటు పాయల్‌ రాజ్‌పుత్‌ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, నభా పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. అంతేకాదు, నభా - రవితేజల మధ్య కెమిస్ట్రీ కూడా సూపర్భ్‌గా ఉంటుందట. దాంతో నభాతో కలిసి మరో సినిమా చేయాలని రవితేజ ఫిక్సయిపోయాడట.

 

ఆ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే నభాకి రవితేజ మాటిచ్చాడట. అంతేకాదు, సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజ మీడియా ముఖంగానూ నభాకు రెండో ఛాన్స్‌ ప్రకటించేశాడు. ఇప్పటికే నభా చేతిలో మెగా కాంపౌండ్‌ మూవీ ఒకటి సిద్ధంగా ఉంది. సాయి ధరమ్‌ తేజ్‌ సరసన 'సోలో లైఫే సో బెటరూ' సినిమాలో నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. వీటితో పాటు, మరి కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయట. చూస్తుంటే, ఈ ఏడాదికి సరిపడా సినిమాలతో నభా డైరీ ఫుల్‌ అయిపోయినట్లే కనిపిస్తోంది. మొత్తానికి అభిమానుల మనసుల్నే కాదు, దర్శక, నిర్మాతలు, హీరోల మనసుల్ని కూడా నభా భలే దోచేస్తోందిలే.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS