పింక్ రీమేక్ ఎలాంటి హడావుడీ లేకుండా మొదలైపోయింది. హైదరాబాద్ శివార్లలో వేసిన సెట్లో పవన్ కల్యాణ్‌పై కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. అయితే అందుకు సంబంధించిన ఫొటోలు కొన్ని బయటకు వచ్చేశాయి. షూటింగ్ స్పాట్లో ఉన్నవాళ్లెవరో సెల్ఫోన్లో పవన్ ఫొటోల్ని తీసి, సోషల్ మీడియాలో పెట్టేశారు. దాంతో సోమవారం అంతా ఆ ఫొటోలే చక్కర్లు కొట్టాయి. ఈ లీకులపై దిల్‌రాజు సీరియస్‌గా ఉన్నాడట. అవుడ్డోర్ షూటింగ్ చేసేటప్పుడు ఫొటోలులీక్ అయ్యాయంటే అర్థం ఉంది.. సెట్లోంచి ఫొటోలు బయటకు ఎలా వెళ్లాయి? అంటే చిత్రబృందంపై ఫైర్ అవుతున్నాడని సమాచారం.
సహాయ దర్శకులు సెల్‌ఫోన్స్ వాడకూడదని ఆర్డరు పాస్ చేశాడట. అయితే.. లైట్‌మెన్స్, బోయ్స్‌ని కంట్రోల్ చేయడం కష్టం. వాళ్ల ద్వారా ఇలాంటి ఫొటోలు బయటకు లీకైపోతుంటాయి. మున్ముందు దిల్‌రాజు ఈ సమస్య కు ఎలాంటి పరిష్కారం ఆలోచిస్తాడో మరి.? నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ పక్కన కథానాయికగా పూజా హెగ్డేని ఎంచుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి లాయర్ సాబ్ అనే పేరు పరిశీలిస్తున్నారు.