లెక్కపెడితే రవితేజ కెరీర్లోనూ రీమేక్ కథలు ఎక్కువగానే కనిపిస్తాయి. ఇప్పుడు ఆయన మరోసారి.. రీమేక్‌ని నమ్ముకొనే ప్రయత్నాల్లో ఉన్నారు. రవితేజ కథానాయకుడిగా టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్ సినిమాలు రూపొందుతున్నాయి. ఈలోగా మరో సినిమాపైకూడా సంతకాలు చేసేస్తున్నాడని టాలీవుడ్ టాక్. తమిళంలో ఘన విజయం సాధించిన బోగన్పై రవితేజ దృష్టి పడిందట. జయం రవి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. దీన్ని తెలుగులో రీమేక్ చేయాలని రవితేజ ఫిక్సయ్యాడట. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన లక్ష్మణ్ తెలుగు వెర్షన్ బాధ్యతలూ తీసుకొనే అవకాశాలున్నాయి. తమిళంలో అరవింద్ స్వామి ఓ కీలక పాత్రలో కనిపించాడు. ఆ స్థానంలో ఓ తెలుగు పాపులర్ హీరో నటిస్తే బాగుంటుందని రవితేజ భావిస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.