రాజా ది గ్రేట్ చిత్రంతో లాంగ్ గ్యాప్ తరువాత హిట్ కొట్టిన మాస్ మహారాజ రవితేజ ఇప్పుడు ఆ చిత్రం అందించిన విజయాన్ని ఆస్వాదించే పనిలో పడ్డాడు.
ఇక ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని దేవ్నార్ స్కూల్ ఫర్ బ్లయిండ్ ని సందర్శించిన రాజా ది గ్రేట్ మూవీ టీం, అక్కడి పిల్లలతో సందడి చేశారు. ముఖ్యంగా హీరో రవితేజ అయితే ఆ పిల్లలతో కలిసి డ్యాన్సు చేయడంతో వారి ఆనందం రెట్టింపు అయింది.
ఈ చిత్రంలో రవితేజ అంధుడి పాత్ర చేయడం అందులో ఒక అంధుడు ఎంతటి ఆత్మవిశ్వాసంతో కష్టాలని ఎదుర్కోవాలన్న అంతర్లీనమైన సందేశం ఉండడంతో మెచ్చుకోదగ్గ అంశం.
ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే, రాజా ది గ్రేట్ చిత్రం బో ఆఫీస్ వద్ద దూసుకుపోతుండగా మంచి ప్లానింగ్ తో ప్రోమోశన్స్ చేస్తున్న ఈ టీం బాక్స్ ఆఫీస్ వద్ద తమ చిత్రానికి కలెక్షన్స్ పెంచుకునే పనిలో ఉంది.