అభినయం-అందం కలిగి ఉన్న మనకున్న అతికొద్దిమంది నటీమణులలో టబు ఒకరు. ఆమె ఎంపిక చేసుకునే పాత్రలు, చిత్రాలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటుంటాయి.
అయితే తన తాజా చిత్రం గోల్మాల్ అగైన్ విడుదల సందర్భంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ- తాను హీరో అజయ్ దేవగన్ కోసం ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధం అని చెప్పేశారు. దీనికి కారణం తమ మధ్య చిన్నతనం నుండి ఉన్న స్నేహమే అని చెప్పింది అలాగే ఈ చిత్రం తరువాత వెంటనే తామిద్దరూ వేరే చిత్రంలో కలిసి నటించేందుకు ఒప్పుకున్నాము అని చెప్పుకొచ్చింది.
ఇదిలావుండగా గోల్మాల్ సిరీస్ తాజాగా వస్తున్న ఈ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ అంచనాలని పెంచేయగా ఇప్పుడు ఈ చిత్ర విడుదల తరువాత వారి అంచనాలను ఏమేరకు అందుకుంటుందో అన్నది ఇంకొన్ని గంటల్లో తెలిసిపోనుంది.
మొత్తానికి హీరో అజయ్ తో ఉన్న తన స్నేహం గురించిన విషయాలు టబు బయటపెట్టేసింది.