రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్వకత్వంలో ఓ సినిమా రూపొందబోతోంది. ఆ సినిమాకి 'నేల టికెట్' అనే టైటిల్ అనుకుంటున్నారు. రవితేజ అంటేనే మాస్, ఊర మాస్.. అలాంటి రవితేజకి 'నేల టికెట్' అంటే ఇది ఏ రేంజ్ ఊరమాస్ సినిమానో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా షూటింగ్ అతా పల్లెటూరి నేపథ్యంలో ఉండబోతోందట.
మొదట్లో ఈ సినిమాకి హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్‌ని అనుకున్నారు. కానీ కుదరలేదు. మాళవికా శర్మ అనే కొత్తమ్మాయిని ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం చేయబోతున్నారట. జగపతిబాబుని ఈ సినిమాలో విలన్‌గా అనుకుంటున్నారు. ఈ ఏడాది 'రాజా ది గ్రేట్' సినిమాతో వచ్చి మంచి విజయం అందుకున్నాడు రవితేజ. లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చినా రవితేజ మాస్ ఇమేజ్‌కి ఏమాత్రం డోకా లేదు. ఎప్పుడొచ్చామన్నది కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే పాయింట్ అన్నట్లుగా గ్యాప్ తర్వాత వచ్చినా, హిట్ కొట్టి, మళ్లీ తన ఉనికిని చాటుకున్నాడు మాస్ రాజా రవితేజ.
ప్రస్తుతం 'టచ్ చేసి చూడు' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. హాట్ బ్యూటీ సీరత్ కపూర్ కీలక పాత్రలో నటిస్తోంది. కాగా తాజా సినిమాకి 'నేల టికెట్' అనే టైటిల్ ప్రచారం రవితేజ అభిమానుల్ని ఖుషీ చేస్తుందనే చెప్పాలి. ఏమో ఇంకా ఈ టైటిల్ పట్ల అఫీషియల్‌గా క్లారిటీ రావాల్సి ఉంది. ఏడాదికి మూడు సినిమాలు చేసే రవితేజ వచ్చే ఏడాది కోసం మూడు సినిమాలు లైన్‌లో పెట్టేసే క్రమంలో ఉన్నట్లే అనిపిస్తోంది.