ఆ గెట‌ప్‌లో ర‌వితేజ షాక్ ఇస్తాడా‌?

By Gowthami - March 08, 2021 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

క్రాక్ తో 2021ని ఘ‌నంగా ప్రారంభించాడు మాస్ మ‌హారాజా. ఇప్పుడు త‌న చేతిలో బోలెడ‌న్ని సినిమాలున్నాయి. పైగా ఈమ‌ధ్యే త‌న పారితోషికాన్ని ఇంకాస్త పెంచాడు. ఇదే జోరులో ప్ర‌యోగాల‌కూ తెర లేపాడు. ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం `ఖిలాడీ`. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. ఇందులో ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం పోషిస్తున్నాడ‌న్న సంగతి తెలిసిందే.

 

అయితే ఇప్పుడు ఈ రెండు పాత్ర‌ల‌కు సంబంధించిన ఓ కీల‌క‌మైన స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో ర‌వితేజ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ట‌. మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో ఓ హీరో రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌డం మామూలే. కాక‌పోతే.. ఇందులో ర‌వితేజ తండ్రీ కొడుకులుగా న‌టిస్తున్నాడు.

 

తండ్రి పాత్రలో ర‌వితేజ ముస‌లి వాడిగా క‌నిపించ‌బోతున్నాడ‌ని, ఆ గెట‌ప్ కూడా వేరే స్థాయిలో ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తెల్ల జుత్తు, మెరిసిన గ‌డ్డంతో.. ర‌వితేజ తెర‌పైకొస్తాడ‌ట‌. ఇలాంటి గెట‌ప్ వేయ‌డం ర‌వితేజ‌కు ఇదే తొలిసారి. మ‌రి ఈ డ్యూయెల్ రోల్ ఏ మేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS