చెక్ ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? న‌ష్ట‌మెంత‌?

By iQlikMovies - March 06, 2021 - 11:38 AM IST

మరిన్ని వార్తలు

గ‌త వారం చాలా సినిమాలు విడుద‌ల‌య్యాయి. అయితే ఫోక‌స్ అంతా.. చెక్ సినిమాపైనే. నాని - చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి కాంబోలో వ‌చ్చిన సినిమా ఇది. ప్ర‌చార చిత్రాలు బాగుండ‌డంతో బ‌జ్ పెరిగింది. దాంతో.. ఈసినిమా చూడాల‌న్న ఉత్సుక‌త పెరిగింది. అయితే దాన్ని నిల‌బెట్టుకోవ‌డంలో ఈ సినిమా పూర్తిగా విఫ‌లమైంది. తొలి రోజు నుంచే డివైడ్ టాక్ రావ‌డం, సినిమా ప్ర‌మోష‌న్లు మ‌రీ వీక్ గా ఉండ‌డంతో.. ఈ సినిమా ఫ్లాప్ నుంచి డిజాస్ట‌ర్ వైపుకు అడుగులేసింది.

 

రెండు తెలుగు రాష్ట్రాల‌లోనూ దాదాపు 16 కోట్ల బిజినెస్ చేసుకుంది చెక్‌. అయితే తొలి వారం గ‌డిచే స‌రికి.. వ‌సూళ్లు 8 కోట్ల ద‌గ్గ‌రే ఆగిపోయాయి. ఇక ఇది పెరిగే అవ‌కాశ‌మే లేదు. దాంతో... దాదాపు 8 కోట్ల న‌ష్టాల్ని బ‌య్య‌ర్లు భ‌రించాల్సివ‌స్తోంది. బుధ‌, గురు, శుక్ర‌వారాలు `చెక్‌` థియేట‌ర్ల‌లో జ‌న‌మే లేరు. శ‌ని, ఆది వారాలు కాస్త టికెట్లు తెగే ఛాన్సుంది. 8 కోట్లు రాబ‌ట్టుకోవ‌డం అసాధ్యం కాబ‌ట్టి, బ‌య్య‌ర్లు... ఈసినిమాతో తీవ్ర న‌ష్టాల్ని ఎదుర్కోక త‌ప్ప‌దు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS