మాస్ మహారాజా రవితేజ హీరోగా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని రూపొందిస్తోన్న సినిమా 'క్రాక్'. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాట చిత్రీకరణ మాత్రమే మిగిలింది. గోవాలో శుక్రవారం (డిసెంబర్ 4) చివరి షెడ్యూల్ మొదలవనున్నది. ఇందులో రవితేజ, శ్రుతి హాసన్‌లపై చివరి పాటను చిత్రీకరించనున్నారు. రాజు సుందరం కొరియోగ్రఫీ సమకూరుస్తున్న ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తవనున్నది.
ఎస్. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా 'క్రాక్' మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.