రవితేజ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయిక. ఈరోజే ఈ చిత్రానికి క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి `క్రాక్` అనే పేరు పెడతారని ముందు నుంచీ ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు దాన్నే ఖాయం చేశారు.
టైటిల్ లోగోని కూడా విడుదల చేశారు. ఇందులో రవితేజ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథని తయారు చేశాడట దర్శకుడు. 2020 వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.