కంటెంట్ ఉన్నోడికి కటౌట్‌తో పని లేదనేది మన పవర్ స్టార్ 'గబ్బర్‌సింగ్' సినిమాతో తెగ పాపులర్ అయిపోయిన డైలాగ్. అయితే, కటౌట్స్‌తో సరైన పబ్లిసిటీ చేయకపోతే, సినిమాలు ఆడే పరిస్థితి లేదు. కానీ, ఇటీవల కటౌట్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన శుభశ్రీ ఘటనతో తమిళ హీరోలు తమ తమ సినిమాలకు కటౌట్లు ససేమిరా పెట్టొద్దని ఫ్యాన్స్‌కి సీరియస్‌గా సూచనలిస్తున్నారు. మొన్న విజయ్ తన సినిమాలకు కటౌట్లు పెట్టొద్దనీ, కటౌట్‌ల కోసం ఖర్చు పెట్టే డబ్బుని మరో రకంగా పేదలకు ఉపయోగపడే కార్యక్రమాల నిమిత్తం వినియోగించాలని సూచించిన సంగతి తెలిసిందే. తాజాగా విశాల్ కూడా అదే ప్రకటన చేశాడు.
ఈ నెల 15న విశాల్ నటించిన 'యాక్షన్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా మీడియాలో చేసే ప్రమోషన్స్ తప్ప, కటౌట్స్‌తో ఎలాంటి పబ్లిసిటీ చేయద్దని విశాల్ సూచించాడు. కటౌట్‌లకు పెట్టే ఖర్చును పేదల కోసం, అనాధ పిల్లల కోసం, ఆధారం లేని వృద్ధుల కోసం ఉపయోగించమని విశాల్ సూచించాడు. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదాన్ని గుర్తించి, జాగ్రత్త పడిన తమిళ హీరోల ముందు చూపును అభినందించకుండా ఉండలేకపోతున్నారు. సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించగా, విశాల్‌పై చిత్రీకరించిన భారీ యాక్షన్ ఘట్టాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.