ఇప్పటికే తమ్ముడి అంత్యక్రియలకు రాలేదు అనే విషయంలో హీరో రవితేజ కి కొద్దిగా ఇబ్బంది గల పరిస్థితులు తలెత్తాయి.
అంతలోనే ఆయనకు డ్రగ్స్ రాకెట్ లో SIT నుండి నోటిసులు అందడంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయినట్టు తెలుస్తున్నది. ఇంతలోనే నిన్న జీషాన్ అలీ ఒక డ్రగ్ పెడ్లర్ ని అరెస్ట్ చేయగా అతని విచారణలో హీరో రవితేజ పేరు బయట పెట్టినట్టుగా ఒకటి రెండు ప్రముఖ టెలివిజన్ ఛానల్స్ వార్తలు ప్రసారం చేశాయి.
దీనితో డ్రగ్స్ ఉచ్చులో రవితేజ చిక్కుకున్నట్టు అందరు భావిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికి, రవితేజ ఇమేజ్ మాత్రం బాగా డ్యామేజ్ అయిందనే చెప్పాలి.
ఇక సిట్ విచారణకి రవితేజ వచ్చే వారం హాజరు అవ్వనున్నాడని తెలుస్తున్నది.