ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ రాజకీయాలకి దూరంగా ఉంటున్నాడు. అయితే తన పూర్తీ సమయాన్ని సినిమాల పైనే పెడుతున్నాడు.
ఇలాంటి సందర్భంలోనే ఎన్టీఆర్ ఒక కొత్త పార్టీ స్థాపించినట్టు వార్తలు వచ్చాయి. ఆ పార్టీ పేరు సమ సమాజ పార్టీ అంటూ నానా హంగామా మొదలయింది. అయితే ఈ సమ సమాజ పార్టీ పెట్టడం అందులో రాజకీయ నాయకుడిగా నటిస్తుండడం అంతా ఆయన సినిమా జైలవకుశ లోని భాగమే అని తెలిసింది.
జైలవకుశ చిత్రంలోని షూటింగ్ కి సంబందించిన కొన్ని ఫొటోస్ లో ఎన్టీఆర్ ఫోటోతో ఉన్న సమ సమాజ పార్టీ బ్యానర్లు, పోస్టర్లు అలాగే రాజకీయ నాయకుడి వేషంలో తారక్ కనపడడంతో ఇది సినిమా కోసం అని తేలిపోయింది.
దీనితో ఆయన కొత్త పార్టీ పెట్టాడు అన్న పుకారు పుకారుగానే తేలిపోయింది.