రవితేజ కోసం మాస్ టైటిల్ ఫిక్స్ చేసిన వర్మ

By iQlikMovies - August 11, 2020 - 10:25 AM IST

మరిన్ని వార్తలు

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'క్రాక్' అనే చిత్రంలో నటిస్తున్నారు.  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చివరి దశలో ఉంది.  ఈ సినిమా తర్వాత రవితేజ మూడు నాలుగు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  అందులో 'వీర' ఫేమ్ రమేష్ వర్మ ప్రాజెక్టు కూడా ఒకటి. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.

రవితేజ నుంచి ప్రేక్షకులు ఎలాంటి అంశాలు ఆశిస్తారో సరిగ్గా అలాంటి కమర్షియల్ అంశాలతో రూపొందే యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. అందుకే ఈ సినిమా స్టోరీ కి తగ్గట్టు 'కిలాడి' అనే టైటిల్ ని ఫైనలైజ్ చేయాలనే ఆలోచనలో రమేష్ వర్మ ఉన్నారట.  ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ కు ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని అనుకుంటున్నారు.

ఈ సినిమాలో రవితేజ సరసన రాశి ఖన్నా, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS