ఫ్లాపుల్లోనే ప‌ట్టించుకోలేదు.. ఇక ‌ హిట్టొస్తే త‌గ్గుతాడా?

మరిన్ని వార్తలు

డిమాండ్ - స‌ప్లై అనే సూత్రం చిత్ర రంగానికీ వ‌ర్తిస్తుంది. ఆ మాట కొస్తే ఇంకాస్త ఎక్కువే వ‌ర్తిస్తుంది. ఇక్కడ డిమాండ్ ఉన్న‌వాళ్లదే రాజ్యం. హిట్టున్న‌వాళ్ల‌కే డిమాండు! పారితోషికాలు డిమాండ్ చేసే అధికారం వాళ్ల‌కే ఉంటుంది. అయితే కొంత‌మంది మాత్రం చేతిలో హిట్స్ లేక‌పోయినా, ద‌ర్జాగా అడిగిందంతా వ‌సూలు చేస్తారు. ర‌వితేజ అదే టైపు. ఓ ద‌శ‌లో వ‌రుస‌గా ఆరు ఫ్లాపులు కొట్టాడు ర‌వితేజ‌. సాధార‌ణంగా ఫ్లాపులు ప‌డితే... పారితోషికాలు త‌గ్గిపోతాయి. కానీ ర‌వితేజ రివ‌ర్స్ గేర్ లో వెళ్లాడు. ఫ్లాపు వ‌చ్చిన ప్ర‌తిసారీ పారితోషికం పెంచుకుంటూ వెళ్లాడు. ర‌వితేజ సినిమాలు ఆడ‌క‌పోయినా.. ఎప్ప‌టికైనా ఆడ‌తాయ‌న్న ఆశ‌తో, ర‌వితేజ అడిగినంత ఇచ్చుకుంటూ వెళ్లారు నిర్మాత‌లు.

 

పైగా ర‌వితేజ సినిమాల‌‌కు హిందీ శాటిలైట్, డిజిట‌ల్ రైట్స్ రూపంలో మంచి డ‌బ్బులు ప‌లుకుతాయి. అందుకే ర‌వితేజ అడిగినంత ఇచ్చేవారు. ఇటీవ‌లే `క్రాక్‌` సినిమాతో ఓ సూప‌ర్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు ర‌వితేజ‌. ఫ్లాపులున్న‌ప్పుడే.. పారితోషికం పెంచుకుంటూ వెళ్లాడు. హిట్ వ‌చ్చినప్పుడు త‌గ్గుతాడా? ఏకంగా 4 కోట్లు పెంచేశాడు. ఇది వ‌ర‌కు 12 కోట్లు తీసుకున్న ర‌వితేజ‌.. ఈ హిట్ తో త‌న పారితోషికాన్ని 16 కోట్లు చేసేసిన‌ట్టు టాక్‌. నక్కిన త్రినాథ‌రావుతో ర‌వితేజ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. అందుకు గానూ 16 కోట్లు డిమాండ్ చేశాడ‌ట‌. ఇంకో హిట్ ప‌డితే.... మాస్ రాజా 20 కోట్లు అనేస్తాడేమో..??


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS