మాస్ రాజా రవితేజ - శీను వైట్ల కాంబినేషన్లో 'నీకోసం', 'దుబాయ్ శీను', 'వెంకీ' సినిమాలు రూపొందాయి. ఇందులో 'వెంకీ', 'దుబాయ్ శీను మంచి విజయాలు అందుకున్నాయి. 'నీకోసం' సినిమా కూడా అప్పట్లో చెప్పుకోదగ్గ విజయమే సాధించింది. ఆ తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ సెట్ అవలేదు. అయితే ఈ మధ్యనే రవితేజ - శ్రీనువైట్ల మధ్య చర్చలు జరిగాయనీ త్వరలో వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవడానికి అన్నీ ఓకే అయ్యాయని సమాచారమ్. ప్రస్తుతం రవితేజ చాలా గ్యాప్ తర్వాత వరుసగా రెండు ప్రెస్టీజియస్ మూవీస్‌లో నటిస్తున్నాడు. అవే 'రాజా ది గ్రేట్', 'టచ్ చేసి చూడు' సినిమాలు. ఈ రెండు విభిన్న తరహా చిత్రాలే. అయితే వీటి తర్వాతనే శ్రీనువైట్ల డైరెక్షన్లో సినిమాకి రవితేజ రెడీ అవుతాడని సమాచారమ్. ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఖచ్చితంగా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. వరుస పెట్టి సినిమాలు చేయడం రవితేజకి అలవాటే. అయితే 'బెంగాల్ టైగర్' సినిమా తర్వాతే రవితేజలో జోరు తగ్గింది. ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు. దాంతో ఆ గ్యాప్‌ని ఫిల్ చేసేందుకు రవితేజ సంసిద్ధంగా ఉన్నాడనీ తెలుస్తోంది. ప్రస్తుతం 'రాజా ది గ్రేట్', టచ్ చేసి చూడు' సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక, మరో రెండు సినిమాలను ట్రాక్‌లో పెట్టే ప్లానింగ్‌లో రవితేజ ఉన్నాడనీ తెలియవస్తోంది. 'రాజా ది గ్రేట్' సినిమాలో రవితేజ అంధుడిగా నటిస్తున్నాడు. తొలిసారిగా ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నాడు రవితేజ. ఈ ప్రయోగం ఫలిస్తే మరిన్ని ప్రయోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సై అంటున్నాడట మాస్ రాజా రవితేజ.