ఆ కాలంలోకి తీసుకెళ్లనున్న రవితేజ

By Inkmantra - July 13, 2020 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'క్రాక్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చివరిదశలో ఉండడంతో రవి తేజ నెక్స్ట్ ప్రాజెక్టులకు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ ఇప్పటికే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది.

 

'సినిమా చూపిస్త మావ' లాంటి కామెడీ సినిమాలు రూపొందించిన త్రినాధ రావు ఈసారి రవితేజ కోసం మరో పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ సబ్జెక్టును రెడీ చేసుకున్నారట. ఈ సినిమాలో రవితేజ డబల్ రోల్ చేస్తారని, ఒక పాత్రలో బిజినెస్ మ్యాన్ గా కనిపిస్తారని సమాచారం. ఈ సినిమా రవితేజ స్టైల్ లోనే ఉన్నప్పటికీ నేపథ్యం మాత్రం విభిన్నంగా ఉంటుందట. పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా కథ జరుగుతుందట.

 

రవితేజ ఇలా పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో కనిపించడం కొత్తేమీ కాదు. లాస్ట్ సినిమా 'డిస్కోరాజా' లో కొంత భాగం రవితేజ రెట్రో లుక్ లో కనిపించారు. అయితే ఈ సినిమా పూర్తి స్థాయిలో పాత కాలంలో ఉంటుందట. పీరియడ్ బ్యాక్ డ్రాప్ అంటే 90 లతో సరిపెట్టుకుంటారా లేక 60లు 70లలోకి వెళ్తారా అనేది చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS