బన్నీ నటనకు ఫిదా అయిన బాలీవుడ్ దర్శకుడు

మరిన్ని వార్తలు

మన తెలుగు సినిమాలు ఈమధ్య దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. యూట్యూబ్ లో హిందీ వెర్షన్ల వ్యూస్ చూస్తేనే ఆ విషయం అర్థం అవుతుంది. సాధారణ ప్రేక్షకులే కాదు, సెలబ్రిటీలు కూడా తెలుగు సినిమాలకు ఫిదా అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా 'అల వైకుంఠపురములో' సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

 

ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా "ఇప్పుడే అల వైకుంఠపురములో సినిమాను నెట్ ఫ్లిక్స్ లో చూశాను. ఏం సినిమా అది!.. స్వచ్చమైన ఎంటర్టైన్మెంట్. ఈ సినిమాను థియేటర్లో చూడలేకపోవడం నాకు జీవితంలో ఒక లోటుగా మిగిలిపోతుంది. మనమున్న క్లిష్ట పరిస్థితులను మర్చిపోవడానికి ఇలాంటి ఆణిముత్యాన్ని మీరు వెంటనే చూడాలి" అంటూ సినిమాను మెచ్చుకున్నారు.

 

దీనికి జవాబిచ్చిన అల్లు అర్జున్ "సంజయ్ జీ, మీకు కృతజ్ఞతలు. మీకు ఈ సినిమా నచ్చడం చాలా సంతోషం" అంటూ థ్యాంక్స్ చెప్పారు. దీనికి మరోసారి స్పందించిన సంజయ్ గుప్తా, "బ్రదర్ నేను మీ నటనను చూసి ఎంత థ్రిల్ అయ్యానో మీకు తెలియదు. మీరు నన్ను నవ్వించారు, కన్నీరు పెట్టించారు. మీకు నేను లైఫ్ లాంగ్ ఫ్యాన్ అయ్యాను. ఎంత త్వరగా మీతో పని చేసే అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నాను" అంటూ బన్నీని ఆకాశానికెత్తాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS