'ఆర్‌ఎక్స్ 100' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై, సెన్సేషనల్ సాధించిన సంగతి తెలిసిందే. తొలి సినిమాకే బోల్డ్ కంటెంట్‌లో నటించి, యూత్‌లో క్రేజ్ సంపాదించింది. యాక్టింగ్ స్కిల్స్ పరంగా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక రెండో సినిమాగా దాదాపు అలాంటి బోల్డ్ కంటెంట్‌నే ఎంచుకుందంటూ మొదట్లో కొందరు విమర్శించారు. అయితే, 'ఆర్‌డీఎక్స్ లవ్' ఆ టైప్ సినిమా కాదని ట్రైలర్‌తో నిరూపించారు.
సినిమా ప్రమోషన్స్ కూడా అలాగే నిర్వహిస్తున్నారు. కథానుసారం రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. కానీ, వాటిలో వల్గారిటీ కనిపించదని తాజాగా బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ చెప్పుకొస్తోంది. అంతేకాదు, తన నటనలోని పరిణీతిని పెంచే పాత్ర ఇదనీ, ఈ సినిమా తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అంటే, ముందుగా పాయల్ రాజ్‌పుత్ గుర్తొచ్చేలా తన పాత్రను దర్శకుడు డిజైన్ చేశాడనీ చెబుతోంది. అనుష్కలాంటి కటౌట్ ఆయె ఈ ముద్దుగుమ్మది. అందానికి అందం, ఆకర్షణకు ఆకర్షణకు, హద్దుల్లేని శృంగారం, పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్.. ఇలా అన్ని క్వాలిటీస్ కలగలిపిన రూపమే పాయల్ రాజ్‌పుత్. అలాంటి రూపం కనుకే, రెండో సినిమాకే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఖచ్చితంగా ఈ సినిమాని ఆదరిస్తారని పాయల్ ఫ్యాన్స్‌ని రిక్వెస్ట్ చేస్తోంది. అందాల భామ అంతందంగా రిక్వెస్ట్ చేస్తే ఫ్యాన్స్ చూడకుండా ఉంటారా.? చెప్పండి. అయితే, 'ఆర్‌ఎక్స్ 100' రేంజ్‌లో ఈ సినిమా ఆదరణ దక్కించుకుంటుందా.? లేదా అనేది చూడాలిక. శంకర్ భాను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సి. కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరించారు. తేజస్ కంచర్ల హీరోగా నటించాడు.