'సైరా నరసింహారెడ్డి'కి కళాబంధు సన్మానం!

మరిన్ని వార్తలు

కళలను ఆదరించడంలో ముందుంటారు. సినీ రాజకీయ వేత్త, మంచి వక్త, మేథావి, మంచి మనిషి అయిన టి. సుబ్బిరామిరెడ్డి. సినీ రంగంలో ఈయనకు ప్రత్యేకమైన గౌరవ స్థానం ఉంది. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా సుబ్బిరామిరెడ్డి ఆదరణ లెక్కే వేరు. మెగా ఫ్యామిలీ అంటే ఈయనకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. చిరంజీవి రీ ఎంట్రీకి సాధారణ అభిమానుల మాదిరిగానే ఈయన కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అదే ఊపులో చిరంజీవితో మెగా ఫ్యామిలీ మల్టీ స్టారర్‌ని అనౌన్స్‌ చేశారు కూడా.

 

అయితే, ఆ సినిమా అప్‌డేట్‌ ఏంటనేది ఇంకా తెలీదు కానీ, ఆ సంగతి పక్కన పెడితే, లేటెస్ట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సైరా నరసింహారెడ్డి' ఘన విజయం సాధించడంతో, చిత్ర యూనిట్‌ని ప్రత్యేకంగా అభినందిస్తూ, లాంఛనంగా సన్మాన సభను ఏర్పాటు చేశారు సుబ్బిరామిరెడ్డి. ఈ సందర్భంగా చిరంజీవి ఆయనను అభినందించారు.

 

కళలపై ఆయనకున్న ఆసక్తికి చేతులెత్తి మొక్కాలని చిరంజీవి వ్యాఖ్యానించారు. అంతేకాదు, 'సైరా' సినిమాకి ఆయనే నిర్మాత అన్నట్లుగా ఈ సినిమా విజయాన్ని ఫీలయ్యారని చిరు చెప్పారు. సినిమా షూటింగ్‌ సమయంలోనే ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందీ.? ఎలా జరుగుతోంది.? అంటూ ఆరా తీసేవారని, ఆ సమయంలోనే సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారని చిరంజీవి చెప్పారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS