దేవి నాగవల్లి, టీవీ 9 జర్నలిస్ట్‌గానే అందరికీ తెలుసు. ఆమెలో ఓ మంచి ఎంటర్‌టైనర్ వున్నారని బిగ్‌బాస్ రియాల్టీ షోతోనే అందరికీ తెలిసింది. దేవి చాలా బాగా డాన్సులు చేసింది.. కామెడీ కూడా పండించింది. అదే సమయంలో, హౌస్‌లో పలు కీలక సందర్భాల్లో తనదైన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టేసింది. ఆమెకి హౌస్‌లో చాలామందితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఇలా దేవి నాగవల్లి బిగ్ బాస్ రియాల్టీ షోతో చాలానే సంపాదించుకుంది.
ఇంతకీ, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ అన్పించుకున్న దేవి నాగవల్లి ఎలా ఎలిమినేట్ అయ్యింది.? ఓట్లు తక్కువ వచ్చాయా.? ఎవర్నన్నా రక్షించేందుకు ఆమెను పక్కన పెట్టేశారా.? ఆమె హౌస్ నుంచి పూర్తిగా ఎలిమినేట్ అయిపోయినట్లేనా.? రహస్య గదిలోకి పంపారా.? గత సీజన్‌లో అలీ రెజాని కొద్ది రోజులు బయటకు పంపి, తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చినట్లుగా దేవిని కూడా అలాగే తీసుకు వస్తారా.? వంటి ప్రశ్నలన్నీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. టీవీ9కి సంబంధించిన జర్నలిస్టులు గతంలో దీప్తి, జాఫర్ బిగ్‌బాస్‌లో హౌస్ మేట్స్‌గా వున్నారు. ఇప్పుడు దేవి వంతు.
మిగతా ఇద్దరితో పోల్చితే, దేవి నాగవల్లి కాస్త డిఫరెంట్. ఆ మాటకొస్తే, దీప్తి అత్యద్భుతంగా బిగ్‌బాస్ వేదికను వినియోగించుకుందనుకోండి.. అది వేరే సంగతి. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఒకటి లేదా రెండు వారాల తర్వాత దీప్తి మళ్ళీ హౌస్‌లోకి అడుగుపెట్టబోతోందట. ప్రత్యేక కారణాలతోనే ఆమెను బయటకు తీసుకొచ్చారనీ, ఈ క్రమంలో ఎలిమినేషన్ నుంచి మెహబూబ్, అరియానా గ్లోరీ, కుమార్ సాయిలలో ఒకరు తప్పించుకున్నారనీ సమాచారం.