మహేష్‌బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రాజెక్ట్ నుండి జగపతిబాబు తప్పుకున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఈ విషయమై, తాజాగా చిత్ర నిర్మాత అనిల్ సుంకర సోషల్ మీడియా ద్వారా ఓ స్టేట్‌మెంట్ విడుదల చేశారు. 'మీతో కలిసి పని చేయలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నాం. మీరు ఈ ప్రాజెక్ట్‌ని ఎంతో ఇష్టపడి ఒప్పుకున్నారు. కానీ, సినిమా నుండి తప్పుకోవడానికి గల కారణాలు పైకి చెప్పలేనివి.
మీరు మమ్మల్ని అర్ధం చేసుకున్నందుకు చాలా థాంక్స్.. అంటూ నిర్మాత తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. జగపతిబాబుతో త్వరలోనే కలిసి పని చేయాలని ఆశిస్తున్నామని అనిల్ సుంకర సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ని అనిల్ రావిపూడి రీ ట్వీట్ చేశారు. ఆయన మమ్మల్ని అర్ధం చేసుకున్నందుకు థాంక్స్.. ఆయన పట్ల ఎప్పుడూ మాకు గౌరవం అలాగే ఉంటుంది.. అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Thanks for understanding and we respect you sir @IamJagguBhai #SarileruNeekevvaru 😊 pic.twitter.com/4H67ev3g3m
— Anil Ravipudi (@AnilRavipudi) July 19, 2019
ఇంతకీ జగపతిబాబు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడానికి గల కారణమేంటో ఈ ఇద్దరూ చెప్పలేదు. ఒప్పుకున్న ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడమనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిది ఇక్కడ జగపతిబాబు ఓ స్టార్ హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు. ఎక్స్‌ట్రా..ఇన్ని రకాలుగా స్టార్‌డమ్ ఉన్న వ్యక్తిని ప్రాజెక్ట్ నుండి తప్పించడమంటే అందుకు గల అంత బలమైన కారణాలేంటో కానీ, తెర వెనక జరిగిన నిజమేంటో నిలకడ మీదే తెలియాలి. ఈ సినిమా కోసం జగ్గూభాయ్ ప్లేస్‌లో ప్రకాష్‌రాజ్‌ని ఎంపిక చేసుకున్నారు.