నాగ్‌ అందుకే అంత తొందరపడుతున్నాడట!

మరిన్ని వార్తలు

బుల్లితెర మెగా రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 3 త్వరలో స్టార్ట్‌ కానుంది. ఈ సీజన్‌కి హోస్ట్‌ ఎవరనే విషయమై తర్జన భర్జనలు పడిన అనంతరం, ఎట్టకేలకు హోస్ట్‌ విషయంలో ఓ క్లారిటీకొచ్చేశారని తెలుస్తోంది. అయితే ఈ సీజన్‌కి హోస్ట్‌ ఎవరనే విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ, కింగ్‌ నాగార్జున పేరు దాదాపు ఓకే అయ్యిందనీ తాజా సమాచారమ్‌. నాగార్జున ప్రస్తుతం 'మన్మధుడు 2' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని కాస్త కూడా గ్యాప్‌ తీసుకోకుండా కింగ్‌ శరవేగంగా కంప్లీట్‌ చేస్తున్నారు. దాదాపు చివరి దశకు చేరుకుంది ఈ సినిమా. రిలీజ్‌ స్లాట్‌ బుక్‌ చేసే ట్రైల్స్‌లో ఉన్నారు. 'మన్మధుడు 2' సినిమాకి సంబంధించి ఈ వేగం, నాగార్జున 'బిగ్‌బాస్‌ 3' కి కమిట్‌ అవ్వడానికి ఓ కారణంగా కూడా చెప్పుకోవచ్చు.

 

ఇక ఇంతవరకూ బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించిన బిగ్‌బాస్‌ మొదటి రెండు సీజన్లూ రెండు రకాలుగా ఆడియన్స్‌కి కిక్‌ ఇచ్చాయి. మూడో సీజన్‌కి సరికొత్త గ్లామర్‌ అద్దేందుకు మన్మధుడు నాగార్జున సిద్ధమయిపోతున్నాడట. ఆల్రెడీ బుల్లితెరపై 'మీలో ఎవరు కోటీశ్వరుడు' రియాల్టీ షోని విజయవంతంగా నడిపించిన అనుభవం నాగార్జునకుంది. అలాగే బిగ్‌బాస్‌ సెకండ్‌ సీజన్‌లో నాని హోస్టింగ్‌లో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చి ఫ్యాన్స్‌లో హుషారు నింపాడు. ఇప్పుడు ఫుల్‌ సీజన్‌కే నాగ్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తే, ఆడియన్స్‌కి ఎలాంటి జోష్‌ అందుతుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS