కార్తీ అంటే మాస్ లుక్స్‌తో కూడిన రొమాంటిక్ హీరో కనిపిస్తాడు. హీరో అనేదానికన్నా, మన పక్కింటబ్బాయ్, కాదు, మనింట్లో ఓ అబ్బాయ్‌లా అనిపిస్తాడు. అలాంటి కార్తీ 'ఖైదీ'తో ఓ ప్రయోగం చేయబోతున్నాడు. హీరోయిన్, రొమాన్స్ లేకుండా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ లేదు కానీ, పదేళ్ల కూతురికి తండ్రిగా కనిపించబోతున్నాడు ఈ సినిమాలో. తండ్రీ, కూతురు మధ్య జరిగే ఎమోషనల్ స్టోరీగా ఈ సినిమాని తెరకెక్కించారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆకట్టుకునే మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, థ్రిల్, సస్పెన్స్ అంశాలు చాలా ఉన్నాయట ఈ సినిమాలో.
ఈ తరహా సినిమాలకు రొమాన్స్, హీరోయిన్స్‌తో పాటలు అడ్డంకిగా అనిపిస్తాయి. సీరియస్ ఫీల్ మిస్సవుతూ ఉంటుంది. అందుకే రిస్క్ చేయలేదట. అంతేకాదు, పాటల్లేని, హీరోయిన్ లేని ఓ స్పెషల్ మూవీగా 'ఖైదీ' రూపొందించారట. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. రాధా మోహన్ ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు. కాగా, ఈ సినిమాతో పాటు విజయ్ నటించిన 'బిగిల్' (తెలుగులో విజిల్) చిత్రం కూడా అదే రోజు విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. అయినా సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా, 'ఖైదీ' ద్వారా ఓ మంచి సినిమా నా కెరీర్‌లో ఉంది..' అనే సంతృప్తి నాకు ఉండిపోతుంది.. అని ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కార్తి చెప్పాడు.