సినీ నటి కళ్యాణి భర్త, దర్శకుడు సూర్యకిరణ్, బిగ్‌బాస్ నుంచి ఒక్క వారానికే దుకాణం సర్దేయాల్సి వచ్చింది. నిజానికి సూర్యకిరణ్ హైపర్ ఎనర్జిటిక్. కానీ, ఎందుకో బిగ్‌హౌస్‌లో ఆ ఎనర్జీ చూపించలేకపోయాడు. అదొక్కటే కారణమా.? ఇంకా బలమైన కారణాలు ఏమైనా వున్నాయా సూర్యకిరణ్ ఎలిమినేట్ అవడానికి.? అన్న విషయమై సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. ఓ ప్లానింగ్‌తో సూర్యకిరణ్‌ని లోపలకు పంపారనీ, అదే ప్లాన్ ప్రకారం సూర్యకిరణ్‌ని బయటకు తెచ్చారనీ, ఇదంతా స్క్రిప్టెడ్ వ్యవహారమనీ కొందరు అభిప్రాయపడుతున్నారు.
‘సూర్యకిరణ్, హౌస్‌లో ఇమడలేకపోయాడు. బయటనే వాడికి ప్రశాంతత ఎక్కువ..’ అని అమ్మ రాజశేఖర్, సూర్యకిరణ్ ఎలిమినేషన్ తర్వాత చేసిన వ్యాఖ్యల్లో కూడా ‘డ్రామా’ ఎక్కువగా కనిపించింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అక్కినేని కాంపౌండ్‌లో సూర్యకిరణ్ ఓ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం సూర్యకిరణ్ ఆ పనుల్లో బిజీగా వుంటాడని సమాచారం. కరోనా నేపథ్యంలో కంటెస్టెంట్స్ ఎంపిక కష్ట తరం కావడంతో, సూర్యకిరణ్‌ని పక్కా ప్లానింగ్‌తో కేవలం ఒకే ఒక్క వారం కోసం పంపించారనేది ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం. ఇందుకోసం అతనికి రెమ్యునరేషన్ కూడా బాగానే సమర్పించారట. హౌస్‌లోకి వెళ్ళి సూర్యకిరణ్ ‘చేయాల్సిందంతా చేసేశాడనీ’, ‘పని పూర్తి చేసుకుని’ బయటకు వచ్చేశాడనీ అంటున్నారు.