'సైరా' స్టిల్స్‌ ఎలా బయటికి వచ్చాయి?

మరిన్ని వార్తలు

'సైరా నరసింహారెడ్డి' సినిమా స్టిల్స్‌ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇదంతా ప్రీ ప్లాన్డ్‌గా చేసినట్లుగా అనిపిస్తోంది. ఈ రోజు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రయోగాత్మక చిత్రం 'రంగస్థలం' రిలీజ్‌. టాక్‌ అదిరిపోతోంది. అభిమానులు ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. ఇదే మంచి తరుణం అనుకున్నారు కాబోలు. అభిమానులకు డబుల్‌ ధమాకా ఇస్తున్నారు. 

మెగాస్టార్‌ 'సైరా నరసింహారెడ్డి' నుండి వరుస పెట్టి స్టిల్స్‌ రిలీజ్‌ చేస్తున్నారు. మొదట్లో షూటింగ్‌ స్పాట్‌ నుండి ఓ స్టిల్‌ రిలీజ్‌ చేశారు. అది కనిపించీ కనిపించకుండా ఉంది. అయితే తర్వాత బిగ్‌బీ తన ట్విట్టర్‌ ద్వారా మొదట తన పాత్ర తాలూకు లుక్‌ రిలీజ్‌ చేయడం, ఇదే సమయంలో తెలుగులో అమితాబ్‌ 'ఆ ఫ్రేమ్‌లో చిరంజీవి ఉండడం గౌరవం' అని తన ట్విట్టర్‌లో పేర్కొనడం ఇదంతా పక్కా ప్లానింగ్‌తో జరుగుతోన్న స్ట్రేటజీ వ్యవహారమని అనిపిస్తోంది. మరో పక్క ఇదంతా పబ్లిసిటీ స్టంట్‌ కోసమే అంటూ విమర్శలు తలెత్తుతున్నాయి. 

ఏది ఏమైనా, ఏ మాటాకామాటే చెప్పుకోవాలి స్టిల్స్‌ మాత్రం అదిరిపోయాయి. ముఖ్యంగా ఈ రోజు రిలీజైన చిరంజీవి, నయనతార యాగం చేస్తున్నట్లుగా ఉన్న స్టిల్‌ అయితే సూపర్బ్‌. అలాగే తెల్లని గుబురు గెడ్డం, నుదుటున ఎర్రటి సింధూరంతో ఉన్న అమితాబ్‌ గెటప్‌ కూడా వావ్‌ అనిపిస్తోంది. ఈ రకంగా తండ్రీ కొడుకులిద్దరూ ఒకేసారి మెగా అభిమానులకు మెగా గిప్ట్స్‌ ఇచ్చారన్న మాట. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS