పుష్ప ట్రైలర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ్రస్ట్రీగా మారింది. ఈ ట్రైలర్‌తో అంచనాలు అమాంతం పెరిగాయి. 2 నిమిషాల 50 సెకన్ల టీజర్లో మొత్తం సినిమానే చూపించేశాడు సుకుమార్. పుష్పగా అల్లు అర్జున్ గెటప్, ఆ టెక్నికల్ వాల్యూస్ ఓ రేంజ్లో ఉన్నాయి. అయితే.. ఈ ట్రైలర్ మూడున్నర గంటలు ఆలస్యంగా విడుదలైంది.తొలుత సోమవారం రాత్రి 6 గంటలకు విడుదల చేస్తామని చిత్రబృందం చెప్పింది. అయితే.. రాత్రి 9.30 వరకూ బయటకు రాలేదు. దాంతో అభిమానులు అసంతృప్తికి గురయ్యారు.
టెక్నికల్ రీజన్స్ వల్ల ట్రైలర్ ఆలస్యమైంది అని చిత్రబృందం చెబుతోంది గానీ, వెనుక చాలా కారణాలున్నాయట. ఫైనల్ అవుట్ పుట్ చూశాక.. బన్నీ కొన్ని కరక్షన్లు చెప్పాడు. అంతే కాదు.. సుకుమార్ కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మార్చమని చెప్పాడట. కొత్త షాట్స్ కలిపినప్పుడు దానికి సీజీ, డీఐ అవసరం. దాని కోసమే.. మూడు గంటలు ఆలస్యమైందని తెలుస్తోంది. హిందీ వెర్షన్ అయితే చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. ట్రైలర్ కే ఇన్ని తిప్పలు పడితే.. మరి సినిమాకి ముందు టీమ్ఎంత టెన్షన్ పడుతుందో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈనెల 17 న పుష్ప విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.