చిరంజీవి సుదీర్ఘ విరామం తర్వాత వస్తోన్న మూవీ 'ఖైదీ నెంబర్ 150'. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిరంజీవి ఓ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పవన్ గురించి విలేఖర్ అడిగిన ప్రశ్నలకి తన సమాధానాన్నిచ్చారు. ఈ నెల 8న జరిగిన 'ఖైదీ' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి పవన్ రాకపోవడంపై పలు రకాల గాసిప్స్ వస్తున్నాయి. ఈ విషయంపై నాగబాబు, చరణ్ ఇప్పటికే సభాముఖంగా స్పందించారు. అయితే ఇది మాకేం కొత్తగా అనిపించడం లేదు. మేము చిన్నప్పట్నుంచీ పవన్‌ని చూస్తూనే ఉన్నాము. పవన్ చాలా మితభాషి. ఎవరితోనూ ఎక్కువగా కలివిడిగా ఉండడు. తన ధోరణి, ప్రవర్తన అంతా వేరు అంటూ చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి చెప్పారు. ఆయన షూటింగ్ నిమిత్తం బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాడు. అంత మాత్రాన మా మధ్య ఏవో బేధాభిప్రాయాలున్నట్లు కావు. ఇదంతా మీ మీడియ సృష్టే తప్ప అని ఆయన తేల్చేశారు. అదీ కాక ఈ సందర్భంగా కాకపోయినా కానీ అవసరం అనుకుంటూ మేము రెగ్యులర్‌గా కలుస్తూనే ఉంటాము అని చిరు చెప్పారు. రాజకీయాలపరంగా కూడా పవన్‌కి నా నుంచి ఫ్యామిలీ నుంచీ పూర్తిగా సపోర్ట్ ఉంటుంది. మా ఇద్దరి బాట వేరు. కానీ గమ్యం ఒక్కటే.. అలా అని ఇద్దరం కలిసి మాత్రం ప్రయాణం చేయలేమని కూడా ఆయన తెలిపారు.