'ఆర్ఆర్ఆర్' ఎందుకు చూడాలి ?

మరిన్ని వార్తలు

'ఆర్ఆర్ఆర్' మానియా మొదలైపోయింది. ఇప్పటికే థియేటర్ల వద్ద భారీభారీ కటౌట్లు వెలిశాయి. ఇక ఆర్ఆర్ఆర్ టీమ్ దేశం మొత్తం ప్రమోషన్స్ తో చుట్టేసింది. సినిమాని మొదటిరోజే చేసేయాలనే కోరిక మూవీ గోయర్స్ లో బలంగా వుంది. అసలు ఇంతలా సినిమాపై ఆసక్తిని పెంచిన అంశాలేంటో ఒక్కసారి చూద్దాం.

 

ఇది రాజమౌళి సినిమా. ఆయన సినిమా అనగానే హిట్టు స్టాంప్ పడాల్సిందే. అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి బాహుబలి వరకూ అన్నీ విజయాలే. ఆయన ఒకొక్క సినిమాతో గ్రాండీయర్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గురించి మాట్లాడేలా చేశారు. ఇప్పుడు అదే స్థాయిలో ఆర్ఆర్ఆర్ రూపొందించారు.

 

ఎన్టీఆర్-రామ్ చరణ్. తెలుగు తెర తొలిసారి ఒక నిఖార్సయిన మల్టీస్టారర్ చూడబోతుంది. ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ జతకట్టారు. ఇద్దరూ స్టార్ హీరోలు. వంద కోట్ల స్టామినా వున్న హీరోలు. అశేష అభిమానగణం వున్న హీరోలు. రామ్ చరణ్ తో మగధీర, ఎన్టీఆర్ తో సింహాద్రి, యమదొంగ లాంటి ఇండస్ట్రీ హిట్లు తీసిన ట్రాక్ రికార్డ్ వున్న రాజమౌళి.. ఆ ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లోకి తెచ్చారు. వీరిద్దరితో రాజమౌళి ఎలాంటి మ్యాజిక్ చేశారో అనే ఆసక్తి అందరిలోనూ వుంది.

 

ఆర్ఆర్ఆర్ కథ పూర్తిగా ఫాంటసీ. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించబోతున్నారు. నిజానికి అల్లూరి. భీమ్ .. భిన్నమైన కాలలో బ్రతికారు. కానీ వారిద్దరిని స్నేహితులుగా కలిపారు రాజమౌళి. భీమ్, అల్లూరి చరిత్ర పుస్తకాల్లో వుంది. అయితే చరిత్రని కూడా బాహుబలిలా ఒక ఫాంటసీ గా చూసి ఆర్ఆర్ఆర్ ని కథని తయారు చేశారు. అయితే బాహుబలి పూర్తిగా రాజుల కాలం నాటి కథ. కానీ కానీ ఆర్ఆర్ఆర్ 1920లో జరుగుతుంది. సో.. వాస్తవానికి దగ్గర చిత్రీకరించాల్సిన అవసరం వుంది. మరి రాజమౌళి ఈ కథ విషయంలో ఎలాంటి మ్యాజిక్కు చేశారనేది తెలియాలంటే ఆర్ఆర్ఆర్ చూడాల్సిందే.

 

ఆర్ఆర్ఆర్ భారీ తారాగణం. ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ నే కాకుండా భారీ తారాగణం వుంది. అలియా భట్, అజయ్ దేవ్‌గణ్, శ్రియాశరన్ తో పాటు ఒలివియా మారిస్, రే స్టీవ్సన్, అలిసన్, ఎమ్మా రోబెర్ట్స్, డైసీ ఎడ్గార్ లాంటి బ్రిటిష్ నటులు ఆర్ఆర్ఆర్ లో కనిపించబోతున్నారు. ఇంతమంది స్టార్ నటులని ఒకే సినిమాలో చూడటం కొత్త అనుభూతి.

 

టెక్నికల్ గా రాజమౌళి సినిమా ఎప్పుడూ ఉన్నంతగా వుంటుంది. ఆర్ఆర్ఆర్ కోసం మరింత స్ట్రాంగ్ టెక్నికల్ వర్క్ చేశారు రాజమౌళి. బాహుబలితో అద్భుతం చూపించిన సెంథిల్ ఆర్ఆర్ఆర్ పనిచేశారు. ఇండియాతో పాటు ఉక్రెయిన్, బల్గేరియా దేశాల్లో షూటింగ్ చేశారు, షాబు సైరిల్ ప్రొడక్షన్ డిజైన్ చేశారు. బాహుబలి విజువల్స్ ఎఫెక్ట్స్ కి పని చేసిన శ్రీనివాస్ మొహన్ ఆర్ఆర్ఆర్ కి పని చేశారు. ఎడిటింగ్ వెటరన్ అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఆర్ఆర్ఆర్ ని ఎడిట్ చేశారు.

 

కీరవాణి అందించిన నాటునాటు, జనని, దోస్తీ పాటలు జనాల్లోకి వెళ్ళిపోయాయి. నాటునాటు పాటకి ఎన్టీఆర్ చరణ్ వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి. ఆ స్టెప్పులని థియేటర్ లో చూసుకోవాలనే ఉత్సాహంతో వున్నారు అభిమానులు. ఆర్ఆర్ఆర్ ఎమోషనల్ డ్రామా. ఇలాంటి ఎమోషనల్ డ్రామాకి మాటలు రాయడంలో దిట్ట సాయి మాధవ్ బుర్రా. ఆర్ఆర్ఆర్ లో ఎలాంటి మాటల మెరపులు మెరిపించారనేది కూడా ఆసక్తికరం.

 

రాజమౌళి ప్రతి సినిమా సినిమాటిక్ ఎక్స్పిరియన్స్ ఇస్తుంది. ఆయన ప్రతి షాట్ లావిష్ గా వుంటుంది. ఆర్ఆర్ఆర్ లో కూడా ఆ లావిష్ నెస్ వుంది.ప్రతి షాట్ ని అత్యున్నత విలువలతోరూపొందిచామని యూనిట్ చెబుతుంది. టికెట్టుకొని థియేటర్ లో అడుగుపెట్టిన ప్రేక్షకుడికి పెద్ద తెర అనుభవం ఇవ్వడమే లక్ష్యంగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కించారు. మొత్తమ్మీద బాహుబలి తర్వాత ప్రపంచానికి గర్వంగా చాటిచెప్పే ఇండియన్ సినిమా అవుతుందని అంచనాలు, నమ్మకాలు ఆర్ఆర్ఆర్ పై వున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS