రెబల్ స్టార్ ప్రభాస్ ఎట్టకేలకు బాహుబలి తర్వాత కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
యంగ్ డైరెక్టర్ సుజీత్ రెండేళ్ళ నిరీక్షనకి తెర పడినట్టయింది. ఇక వివరాల్లోకి వెళితే, ప్రభాస్-సుజీత్ చిత్రం రేపు ప్రారంభం అవబోతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యువి క్రియేషన్స్ దీనిని నిర్మిస్తుండగా ఈ చిత్రం యొక్క బడ్జెట్ భారీగానే ఉండబోతుంది అని ఫిలిం నగర్ వర్గాల టాక్.
అయితే ఈ సినిమాకి సంబందించిన కీలక సమాచారం అంతా రేపు జరగబోయే ప్రారంబోత్సవ సందర్భంగా తెలుస్తుంది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే ఒక టాప్ హీరోయిన్ ఈ చిత్రానికి సైన్ చేయబోతుందట.
ఏదైతే ఏంటి చివరకు ప్రభాస్ బాహుబలి తర్వాత ఒక కొత్త సినిమాకి ఒకే చెప్పితన ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త చెప్పాడు.