ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చి సర్ప్రైజ్ హిట్ గా నిలిచింది ''ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ''. మిస్టరీ చేధించే డిటెక్టివ్ కథ ఇది. మిస్టరీ జోనర్ సినిమాకి సస్పెన్స్‌ని హోల్డ్ చేయడం కీలకం. ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు ఏజెంట్. చంటబ్బాయ్లా కామెడీ టచ్ ఇచ్చి.. నేపథ్యంలో ఒక సీరియస్ కథని నడిపి దాని చుట్టూ అల్లుకున్న మిస్టరీ ప్రేక్షకులకు నచ్చింది.
నవీన్ పొలిశెట్టి అంతగా తెలియని నటుడు. ఐతే ఆ పాత్రలో తనని తప్పితే ఇంకెవరినీ ఊహించడానికి వీలులేనంత కొత్తగా చేశాడు. మిస్టరీ జోనర్‌ని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చింది. ఈ జోనర్ కి మదర్ సెంటిమెంట్ కూడ యాడ్ అవ్వడంతో మరింత రీచ్ అయ్యింది. మొత్తానికి చిన్న సినిమాగా వచ్చి లాభాల బాట పట్టిన సినిమాగా ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ నిలిచింది.