రీక్యాప్‌ 2019: టాప్ 10 హిట్స్

మరిన్ని వార్తలు

మరి కొద్ది గంట‌ల్లో 2019 ముగిసిపోతుంది. ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ యేడాది రికార్డు స్థాయిలో సినిమాలు విడుద‌ల‌య్యాయి. స్టార్లు త‌మ హ‌వా చూపించ‌డానికి ప్ర‌య‌త్నించారు. యువ హీరోలు కూడా ఎడా పెడా సినిమాలు తీశారు. ఎప్ప‌టిలా కొత్త హీరోలొచ్చాయి. ప్రొడ్యూస‌ర్లు వ‌చ్చారు. అయితే ఎన్ని సినిమాలొచ్చినా విజ‌యాల శాతం చాలా త‌క్కువ‌గానే క‌నిపించింది. మ‌రి 2019లో గుర్తుపెట్టుకోదగ్గ సినిమాలేవీ ? టాప్ 10లో నిలిచేవి ఏవి? ఒక్కసారి రివైండ్ చేస్తే...

 

ఎఫ్ 2 :

 

2019లో నవ్వులతో పాటు కాసులు వర్షం కురిపించిన సినిమా. సంక్రాంతి సినిమాగా ఎప్పటికీ గుర్తుపెట్టుకునే సినిమా. వెంకటేష్, వరుణ్ తేజులు చేసిన హంగామాకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సినిమా ప్రధాన లక్ష్యం వినోదం పంచడం.. ఆ వినోదంని నూటికి నూరుపాళ్ళు పంచిన సినిమాగా నిలిచింది ఎఫ్ 2.

 

మహర్షి:

 

మహేష్ బాబు ఏడాది కూడా విజయం అందుకున్నాడు. మంచి మెసేజ్ కి కమర్షియల్ హంగులు అద్ది 'మహర్షి' తో మెప్పించాడు. సోషల్‌ మెసేజ్‌ వున్న థీమ్‌ని కమర్షియల్‌ పంథాలో చెప్పడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి సక్సెస్ అయ్యాడు. హిట్ తో పాటు మంచి సినిమా చేశారన్న పేరు తెచ్చుకుంది మహర్షి. టోటల్ గా మహర్షి మహేష్ కెరీర్ లో మరో మరపురాని సినిమాగా నిలిచింది.

 

సైరా:

 

'సైరా'.. ఈ ఏడాది వచ్చిన అతి భారీ సినిమా. బాహుబలి తర్వాత అంత హెవీ నెస్ తో వచ్చిన ఈ సినిమా అభిమానులని అలరించింది. చిరు కెరీర్ లో హిస్టారికల్ మూవీగా నిలిచింది. ప్రేక్షకులని సంతృప్తి పరచడంలో, దేశభక్తిని ప్రబోధించడంలో సక్సెస్ సాధించింది సైరా. నటుడిగా చిరంజీవికి చిర స్థాయి సినిమా సైరా.

 

ఇస్మార్ట్ శంకర్ :

 

ఈ ఏడాది మాస్ హిట్ 'ఇస్మార్ట్ శంకర్'. రామ్ ని ఊర మాస్ హీరోగా చేసిన సినిమా ఇదే. సినిమా చూసిన జనాలు పూరికి మళ్ళీ ఫిదా అయిపోయారు. ఎంత ఊర మాస్ సినిమా చేసిన బావుంటే జనాలు ఆదరిస్తారని నిరూపించింది ఇస్మార్ట్ శంకర్. అటు వసుళ్ళూ పరంగా కూడా ఆదరగొట్టింది.

 

మజిలీ:

 

ఈ నాగచైతన్య 'మజిలీ' బావుంది. పెళ్లి తర్వాత శ్రీమతి సమంతతో కలసి చేసిన మజిలీ సినిమా మంచి ప్రేమ కధగా నిలిచింది. శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి ఫ్లాపులతో నిరాశగా వున్న చైతన్యకు మజిలీ కొత్త ఊపు ఇచ్చింది. వెండితెరపై ప్రేమ కథ.. ఎవర్ గ్రీన్ ఫార్ముల. ఎన్ని ప్రేమ కధలు వచ్చినా మళ్ళీ మళ్ళీ చూడడానికి ప్రేక్షకులను ఎప్పుడూ సిద్ధంగా వుంటారు. అలా ఈ ఏడాది వచ్చిన మరో మెచ్యూర్ లవ్ స్టోరీగా నిలిచింది మజిలీ. జెర్సీ: నానికి 2019 మెమరబుల్ ఇయర్. ఈ ఏడాది చేసిన 'జెర్సీ' సినిమా ఒకరకంగా క్లాసిక్ గా నిలిచింది. నటుడిగా వంద శాతం ఆనందపడ్డాడు నాని. జేర్సీ కేవలం ఒక సినిమా కాదు. దర్శకుడు గౌతమ్‌ తెరపై జీవితాన్ని ఆవిష్కరిస్తే... నాని 'అర్జున్‌' పాత్రకి ప్రాణం పోసాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నాని సూపర్ అని కితాబిచ్చారు. హృదయాన్ని తాకే సినిమాగా నిలిచింది జెర్సీ.

 

గద్దలకొండ గణేష్‌ :

 

వరుణ్ తేజ్ కి ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఎఫ్ 2తర్వాత వచ్చిన గద్దలకొండ గణేష్‌ కూడా విజయం సాధించింది. 'జిగర్తాండ' అనే క్రైమ్‌ కామెడీని 'గద్దల కొండ గణేష్'గా రీమేక్‌ చేసాడు వరుణ్. 'జిగర్తాండ' ఒక మంచి కాన్సెప్ట్‌ బేస్డ్‌ క్రైమ్‌ కామెడీ. తెలుగులో కూడా ఆ మ్యాజిక్ వర్క్ అవుట్ అయ్యింది. వరుణ్.. తనని ఇంతవరకు జనం చూసిన దానికి భిన్నంగా కనిపించి విజయం సాధించాడు. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మంచి ఫలితాన్ని రాబట్టింది.

 

ఓ బేబీ:

 

ఈ ఏడాది సమంతకి రెండో హిట్ గా నిలిచింది ఓ బేబీ. కొరియన్‌ చిత్రంకి రీమేక్ ఇది. ఆ సినిమా ఆత్మని క్యాచ్‌ చేసి ఎమోషన్స్‌ని అద్భుతంగా మళ్లీ పండించగలిగింది దర్శకురాలు నందిని రెడ్డి. నటిగా సమంతని మరో మెట్టు ఎక్కించింది. బామ్మ పాత్రలో సమంత పరకాయ ప్రవేశం చేసింది. తెరపై నిజంగా జీవితమే ఆవిష్కృతం అవుతోన్న భావన కలిగించడంలో బేబీ సక్సెస్ అయ్యింది.

 

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ:

 

మిస్టరీ చేధించే డిటెక్టివ్‌ కథగా వచ్చి హిట్ కొట్టింది.. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఈ సినిమాతో కొత్త ట్యాలెంట్ ఆవిష్కృతమైయింది. నవీన్‌ పొలిశెట్టి అంతగా తెలియని నటుడయినా కానీ అతనిలో టాలెంట్‌ ని బయటపెట్టి , అదే సమయంలో కొత్త దర్శకుడు స్వరూప్‌ కి కూడా మంచి పేరు తీసుకొచ్చింది.

 

వెంకీమామ:

 

ఏడాది చివర్లో వచ్చిన వెంకీమామ కూడా ఫ్యాన్స్ ని అలరిచింది. నిజ జీవితంలో మేనమామ-మేనల్లుడు అయిన వెంకటేష్‌, చైతన్య తెరపై కూడా అదే సంబంధంతో తెరపై కనిపించారు. ముఖ్యంగా ఫ్యామిలీ సినిమాలు చూసే ఆడియన్స్ మనసు గెలుచుకుంది వెంకీమామా. విమర్శలు అటుంచితే.. బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా వర్క్ అవుట్ అయ్యింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS