2019 రీక్యాప్‌: న్యూస్ మేక‌ర్స్‌

By Gowthami - December 30, 2019 - 21:00 PM IST

మరిన్ని వార్తలు

2019 టాలీవుడ్ క్యాలండర్ లో హాట్ టాపిక్కులు బాగానే వున్నాయి. వివాదాలు, గాసిప్పులు, సంచలనాలు చోటు చేసుకున్నాయ్. ఈ యేడాది కొంత‌మంది న్యూస్ మేకర్స్ లిస్టులో చేరారు. మీడియా అంతా వాళ్ల క‌ద‌లిక‌ల‌పై గ‌ట్టిగానే ఓ క‌న్నేసింది. ఏదో ఓ రూపంలో వీళ్లంతా వార్త‌ల్లో నిలిచారు. మీడియాకు కావ‌ల్సినంత మేట‌ర్ అందించారు. వాళ్లెవ‌రంటే..

 

వివి వినాయ‌క్:

 

మాస్ సినిమాలతో ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించిన దర్శకుడు వినాయక్. దర్శకుడిగా ఆయన కెరీర్ లో బోలెడు బ్లాక్ బస్టర్స్. ఇప్పుడు ఆయన మెగాఫోన్ వదిలి మేకప్ వేసుకున్నారు. సీనయ్యగా .. ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హీరోలు దర్శకులయ్యారు. కానీ ఒక దర్శుకుడు హీరో అవ్వడం బహుసా ఈ మధ్య కాలంలో జరగలేదు. అదీ వినాయక్ లాంటి మాస్ వెటరన్ దర్శకుడు.. ఇప్పుడు నటుడిగా మెప్పించడానికి రెడీ అవ్వడం టాలీవుడ్ లో మేజర్ న్యూస్ అయ్యింది.

 

రామ్ గోపాల్ వర్మ:

 

వర్మ ఎప్పుడూ న్యూస్ మేకరే. వివాదాలతో సహవాసం చేసే వర్మ.. ఈ ఏడాది ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌, క‌మ్మరాజ్యంలో సినిమాల‌తో మీడియాకి కావల్సినంత స్టఫ్ ఇచ్చేశాడు. వర్మ సినిమాలో ఇప్పుడు విషయం లేదు. కేవలం మీడియాకి పనికొచ్చే విషయాలే వుంటున్నాయి. కమ్మ రాజ్యమని, ఎన్టీఆర్, లక్ష్మి... అని టైటిల్స్ పెట్టుకొని ఫ్రీగా పబ్లిసిటీ గుంజుకున్న వర్మ .. తన సినిమాలని చక్కగానే విడుదల చేసుకున్నాడు. అవి అట్టర్ ఫ్లాఫ్స్ గా మిగిలాయి. అది వేరే సంగతి. మొత్తనికి ఈ ఏడాది మొత్తం అత్యధికంగా మీడియాలో కనిపించిన న్యూస్ మేకర్.. ది వన్ అండ్ ఓన్లీ ఆర్జీవి.

 

రాహుల్ సింప్లిగంజ్

 

ఎలాంటి అంచనాలు లేకుండ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి.. టైటిల్ ఎగరేసుకుపోయాడు రాహుల్ సింప్లిగంజ్ . బేసిగ్గా సింగర్. కానీ ఇప్పుడు రాహుల్ సింప్లిగంజ్ బిగ్ బాస్ విన్నర్ గానే పాపులర్. గత ఏడాది కౌశల్ ఆర్మీ అని పెద్ద హడావిడి జరిగింది. ఈ ఏడాది అంత హడావిడి లేదు కానీ శ్రీముఖికి గట్టి పోటీ ఇచ్చిన రాహుల్.. చివరికి ఆమెను వెనక్కి నెట్టి బిగ్ బాస్ అనిపించుకున్నాడు. ఇప్పుడు రాహుల్ సింప్లిగంజ్ తెలియని తెలుగు ఆడియన్స్ వుండరు.

 

ప‌వ‌న్ క‌ల్యాణ్

 

పవన్ కళ్యాణ్ కి 2019 వెరీ బ్యాడ్ ఇయర్. పొలిటికల్ గా కలసిరాలేదు. పవర్ స్టార్ సొంతగా పోటి చేసిన రెండు స్థానాలూ ఓడిపోయాడు. జనసేన జనం లేని సేనగా కనిపించింది. దీంతో ఆయన మళ్ళీ మేకప్ వేసుకోబోతున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. నిర్మాతలు రెడీ. అయితే పవన్ కళ్యాణ్ నుండి ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన రాలేదు. బహుసా 2020లో సినిమా ప్రకటన వుండే ఛాన్స్ అయితే వుంది.

 

నాగ‌బాబు:

 

మెగాబ్రదర్ నాగబాబు.. జబర్దస్త్ బ్రాండ్ అంబాసిడర్. అలాంటి నాగబాబు ఆ షో నుండి బయటికి రావడం వార్తల్లో నిలిచింది. ఎవో క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల యాజనమ్యంతో ఇంక ప్రయాణం చేయలేక ఆయన బయటికి వచ్చేశారని చెప్పారు. నవ్వుల బాబు నాగబాబు ఆ షోకి దూరం కావడం చాలామంది ఫాన్స్ నీ నిరాశపరిచింది. ఇందులో సామాజిక వర్గ సమీకరణలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే అవన్నీ అనవసరం. ఇప్పుడు ఆయన 'అదిరింది' అనే షో చేస్తున్నారు. ఇది జబర్దస్త్ కి ఛాలెంజ్ అని స్వయంగా ఆయనే వీడియో రిలీజ్ చేయడం.. హాట్ టాపిక్ గా నిలిచింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS