పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీ రిలీజ్ కావటానికి ఒక్క రోజు ఉంది. ఈ నేపథ్యంలో అన్ని భాషల్లోను కల్కి హవా మొదలయ్యింది. ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్, కమల్ లాంటి మహా మహులు ఉన్నారు కల్కిలో. ఈ మూవీ టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అన్ని రాష్ట్రాల్లో కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవటం, ఫుల్ అయిపోవటం జరిగిపోయింది. ఏపీలో ఇంకా టికెట్స్ ఓపెన్ చేయలేదని ప్రభాస్ ఫాన్స్ మౌనం దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు అంటే ఒక్క రోజు ముందు ఏపీలో కల్కి టికెట్స్ ఓపెన్ చేశారు.
ఓవర్సీస్‌లో కల్కి బుకింగ్స్ ముందే ఓపెన్ అయ్యాయి. రికార్డ్ స్థాయిలో టికెట్స్ బుక్ అవుతుండటం గమనార్హం. ఇప్పటివరకు ఉన్న ఓవర్సిస్ రికార్డ్స్ ని కల్కి అధిగమించింది. బాహుబలి, RRR, సలార్ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఓవర్సిస్ లో దాదాపు 30 కోట్లు వరకూ గ్రాస్ వసూళ్లు వచ్చాయి. యూఎస్‌లో అడ్వాన్స్ సేల్స్ ఊహించని రీతిలో సాగుతున్నాయి. అక్కడ 500 లొకేషన్లలో 3000 షోలకు గానూ ఇప్పటికే 1.5 లక్షలకు పైగా టికెట్లు సేల్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా యూఎస్‌లో అప్పుడే 4 మిలియన్ డాలర్ల మార్కును చేరింది. అత్యంత వేగంగా కలక్షన్స్ సాధించిన తొలి ఇండియన్ మూవీగా ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' రికార్డు క్రియేట్ చేసింది.
ఒక తెలుగు సినిమాకి ఓవర్సిస్ లో ఇంత భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ రావటం పలువుర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హాలీవుడ్ సినిమాలకి సమానంగా టాలీవుడ్ కల్కి మూవీ క్రేజ్ తెచ్చుకుంటోంది. ప్రభాస్ ఓవర్సీస్ మార్కెట్ స్థాయి ఏంటో అన్నది మరోసారి రుజువైంది. బాలీవుడ్ ఖాన్ లు కూడా డార్లింగ్ మార్కెట్ ముందు బలాదూర్. నార్త్ లో కూడా కల్కి మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతోంది. నార్త్ లో తెలుగు సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా కల్కి నిలిచిపోతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.