ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు బరిలో ఉన్నా.. ప్రధాన పోటీ ఇప్పుడు రెండు సినిమాలకే షిఫ్ట్ అయ్యింది. ఆ రెండింటిలో గెలుపు ఎవరిది? అంటూ టాలీవుడ్ లో ఆసక్తికకరమైన చర్చ మొదలైంది. అందరి దృష్టీ.. తమ వైపుకు తిప్పుకున్న ఆసినిమాలే... రెడ్, అల్లుడు అదుర్స్.
ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. రెండూ ఒక రోజు వ్యవధిలో విడుదల కావల్సిన సినిమాలు. జనవరి 14న రెడ్, 15న అల్లుడు అదుర్స్ విడుదల అవ్వాలి. అయితే.. అల్లుడు అదుర్స్ తన నిర్ణయం మార్చుకుంది. ఒక రోజు ముందే... అంటే జనవరి 14నే ఈ సినిమా కూడా వస్తోంది. అంటే.. ఒకే రోజు రెండు సినిమాలు ఢీ కొట్టబోతున్నాయన్నమాట. అయితే ఒకేరోజు రెండు సినిమాలు రావడం ఏమిటని? ప్రొడ్యూసర్ గిల్డ్ ప్రశ్నిస్తోంది. సినిమాల మధ్య క్లాష్ రాకూడదన్న ఉద్దేశంతో.. ముందే రిలీజ్ డేట్లు ఫిక్స్ చేస్తోంది ప్రొడ్యూసర్‌గిల్డ్. అయితే ఆ నిబంధనల్ని పక్కన పెట్టి రెండు సినిమాలూ ఒకేరోజు విడుదల కావడం.. చర్చనీయాంశమైంది. అయితే వెనక్కి తగ్గడానికి ఏ సినిమా ఒప్పుకోవడం లేదు. అందుకే ఈ రెండింటిలో అంతిమ విజయం ఎవరిది? అనే ఆసక్తి నెలకొంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.