ఛలో, భీష్మలతో ఆకట్టుకున్న దర్శకుడు వెంకీ కుడుముల. మూడో సినిమాకోసం ఓ స్టార్ హీరోని వెదికి పట్టుకునే పనిలో ఉన్నాడు. మహేష్ బాబు, రామ్ చరణ్‌ల పేర్లు బాగా పరిశీలనలో ఉన్నాయి. వీరిద్దరికీ వెంకీ టచ్‌లోనే ఉన్నాడు. రామ్ కి కూడా వెంకీ కుడుముల కథ చెప్పినట్టు సమాచారం. అయితే.. వెంకీ తదుపరి సినిమా మహేష్ తో ఖరారయ్యే అవకాశాలున్నాయి. మరో విశేషం ఏమిటంటే.. ఈ చిత్రానికి కొరటాల శివ నిర్మాతగా వ్యవహరిస్తాడట.
ఈమధ్య కొరటాల శివ చిత్ర నిర్మాణంపైనా దృష్టి నిలిపిన సంగతి తెలిసిందే. తన శిష్యుడి కోసం ఓ వెబ్ సిరీస్‌ని నిర్మిస్తున్నాడు. అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకి తాను ఒకానొక పార్టనర్. ఇప్పుడు మహేష్‌తో సినిమాకి సైతం తాను భాగస్వామిగా ఉండాలని భావిస్తున్నాడట. మహేష్ కీ కొరటాలకీ మంచి అనుబంధం ఉంది. ఇద్దరి కాంబోలో రెండు సూపర్ హిట్లు వచ్చాయి. కొరటాల ఏం చెప్పినా చేయడానికి మహేష్ రెడీ. కొరటాల గట్టి రికమెండేషన్ తోనే ఈ ప్రాజెక్టుకు మహేష్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.