'అరవింద'కు మరో స్పెషల్‌.!

మరిన్ని వార్తలు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన 'అరవింద సమేత..' చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ముందు నాలుగు పాటలతో విడుదల చేసిన ఈ సినిమాకు మరో పాటను కూడా యాడ్‌ చేయబోతున్నారు. అదే 'రెడ్డమ్మతల్లి..' సాంగ్‌. 

ఇది కూడా సిట్యువేషనల్‌ సాంగే. సినిమాలో సన్నివేశానికి అనుగుణంగా సాగే పాట ఇది. ఈ పాట సినిమాకు మరింత స్పెషల్‌ అట్రాక్షన్‌ కానుంది. పెంచలదాస్‌ గొంతు ఈ పాటకు అదనపు ఆకర్షణ. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ సాంగ్‌ హల్‌చల్‌ చేస్తోంది. త్వరలోనే సినిమాలో ఈ సాంగ్‌ని యాడ్‌ చేయనున్నారు. విడుదలైన మూడు రోజుల్లోనే 'అరవింద సమేత' 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఇదే పోజిటివ్‌ టాక్‌తో 'అరవింద సమేత' రెండో వారం కూడా ఊహించని కలెక్షన్స్‌ని సాధించి పెట్టడం ఖాయమని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. 

ఇదిలా ఉంటే మరోవైపు ఈ సినిమాలో రాయలసీమ ఫ్యాక్షనిజానికి సంబంధించిన కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తలెత్తిన వివాదం కారణంగా సినిమా నుండి ఆ సీన్లను తొలగించాలనీ లేదంటే రాయలసీమలో సినిమా ప్రదర్శన నిలిపివేస్తామంటూ పలు విద్యార్ధి, ప్రజా సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. 

ఈ వివాదాన్ని చిత్ర యూనిట్‌ సీరియస్‌గా తీసుకుంటుందా? లేక లైట్‌ తీసుకుంటుందా.? అనేది చూడాలిక.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS