సినిమా పరిశ్రమలో లక్ కి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఒక్కోసారి లక్ కలిసి వచ్చి తక్కువ టాలెంట్ తో టాప్ రేంజ్ కి వెళ్ళిన వారు ఉన్నారు.
అయితే ఆ లక్ ఇప్పుడు ఒక తెలుగు హీరోయిన్ కి లేనట్టుగా అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే, రెజినా కి ఈ మధ్యనే బాలీవుడ్ లో ఆంఖే సినిమాకి సీక్వెల్ అయిన ఆంఖే 2లో అవకాశం దక్కింది. డబల్ లక్ గా ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ తో నటించే అవకాశం కొట్టేసింది.
కాకపోతే ఈ సినిమా షూటింగ్ మొదలు కావడంలో ఆలస్యం జరుగుతుంది. కొంతమంది అయితే ఈ సినిమా పెర్మనెంట్ గా ఆగిపోయింది అని కూడా అంటున్నారు.
బాలీవుడ్ లో బంపర్ ఎంట్రీ ఇద్దామనుకున్న మన రెజినా కి బ్రేక్ పడినట్టేనా?!