మన దేశంలో మతం అనేది ఒక సున్నితమైన అంశం. అయితే అదే మతం పై ఇప్పుడు రాజకీయాలు కూడా మొదలవ్వడం దురదృష్టకరం.
అయితే మన న్యూస్ కి వస్తే, ప్రముఖ సింగర్ సోను నిగం చేసిన కొన్ని వ్యాఖ్యలు ముస్లిం మతస్తుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నట్టు కొందరు ఆరోపిస్తున్నారు. దీనికి కారణం ఆయన ప్రతోరోజు ఉదయం అజాన్ పేరిట మసీదుల్లో నుండి వినిపించే ప్రార్ధన పై వ్యాఖ్యలు చేయడమే.
ఈ వ్యాఖ్యలు తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో ఆయన పై అంతర్జాలంలో ఒక్కసారిగా ఎదురుదాడికి దిగారు. దీనిపై సోను నిగం ఆచితూచి స్పందించాడు. తన వ్యాఖ్యలు తప్పుగా అర్డంచేసుకున్నారని, ఇలా పెద్దగా లౌడ్ స్పీకర్స్ వాడే సంస్కృతి గుడి, చర్చి అలాగే మసీదు లలో ఉంటే దానికి వ్యతిరేకం అని స్పష్టం చేశాడు.
కాకపోతే ఇలాంటి సున్నితమైన అంశాల పైన వ్యాఖ్యలు చేసే ముందు కొద్దిగా జాగ్రత పాటిస్తే ఉంటే మంచిది అని కొంతమంది సలహా ఇస్తున్నారు.