రెజీనా యాక్షన్‌: డూప్స్‌ లేకుండా!

మరిన్ని వార్తలు

అందాల ఆరబోతతో రెచ్చిపోయే రెజీనా ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలపై దృష్టి పెట్టింది. ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటోంది. కథా, కథనం ఆసక్తిగా ఉండేలా చూసుకుంటోంది. ఆ క్రమంలోనే ఓ థ్రిల్లర్‌ మూవీకి సైన్‌ చేసింది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని కార్తిక్‌ రాజు తెరకెక్కిస్తున్నారు. ఆర్కియాలజిస్ట్‌ పాత్రలో ఈ సినిమాలో రెజీనా కనిపించబోతోంది. స్టోరీ పరంగా సినిమాలో యాక్షన్‌, థ్రిల్లింగ్‌ అంశాలకు ఎక్కువ స్కోప్‌ ఉందట. హీరోయిన్‌పై చిత్రీకరించే యాక్షన్‌ సీక్వెన్సెస్‌ అద్భుతంగా ఉండబోతున్నాయట.

 

ఈ సీన్స్‌లో రెజీనా డూప్‌ లేకుండా యాక్ట్‌ చేయబోతోందని తెలుస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా రెజీనా శిక్షణ తీసుకుందట. ఈ నెల 13 నుండి ఈ థ్రిల్లర్‌ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. ఇటీవల 'ఎవరు' సినిమాలో రెజీనా పర్‌ఫామెన్స్‌కి మంచి మార్కులు పడ్డాయి. డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న ఆ పాత్రలో నటించి మెప్పించింది. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక తాజా మూవీ ఆమెలోని నటిని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్లనుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఇదిలా ఉంటే, ఈ మధ్య మెగాస్టార్‌ సినిమాలో రెజీనా స్పెషల్‌ సాంగ్‌ అంటూ ప్రచారం జరిగింది. అయితే, ఆ స్పెషల్‌ సాంగ్‌కి రెజీనా నో చెప్పిందనే గాసిప్‌ కూడా చక్కర్లు కొట్టింది. ఇప్పుడిప్పుడే హీరోయిన్‌ సెంట్రిక్‌ ఇమేజ్‌ పొందుతున్న రెజీనా, ఆ ఇమేజ్‌కి డ్యామేజ్‌ అవుతుందన్న ఉద్దేశ్యంతోనే ఒకవేళ ఆ ఆఫర్‌ కాదనుకుందా.? నిజమేంటో నిదానంగా తెలియాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS