జోరు పెంచిన 'వెంకీ మామ'.. ఈ సారీ రెండు?

By Inkmantra - January 08, 2020 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

2019 సంవత్సరం మొదటిలో 'ఎఫ్‌ 2'తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన వెంకీ, ఇయర్‌ ఎండింగ్‌లో 'వెంకీ మామ'తో వచ్చి మరో హిట్‌ ఎత్తుకెళ్లిపోయాడు. ఈ రెండు సినిమాలూ మల్టీ స్టారర్స్‌ కావడం విశేషం. ఇక కొత్త సంవత్సరంలోనూ వెంకీ రెండు ప్రాజెక్టులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ 'అసురన్‌' రీమేక్‌లో వెంకీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లోగా మరో ప్రాజెక్ట్‌ వెంకీ ఖాతాలో పడినట్లు తెలుస్తోంది. 'యాత్ర' డైరెక్టర్‌ మహి. వి.రాఘవ వెంకీ కోసం ఓ పవర్‌ ఫుల్‌ స్టోరీని సిద్ధం చేశాడట. స్టోరీ లైన్‌ వెంకీకి వినిపించగా దాదాపు ఓకే చేసినట్లు సమాచారం.

 

సో ఈ ప్రాజెక్ట్‌ కూడా వెంకీ లిస్టులో చేరిపోయినట్లే. ఈ సినిమా పీవీపీ బ్యానర్‌లో రూపొందనుందట. ఇక 'అసురన్‌' రీమేక్‌ విషయానికి వస్తే, రేపో మాపో సెట్స్‌ మీదికెళ్లనుది. ఎలాగూ రీమేక్‌ మూవీ కాబట్టి, నిర్మాణానికి పెద్దగా టైమ్‌ తీసుకోవాలనుకోవడం లేదట. సమ్మర్‌ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారట. సురేష్‌ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత వెంటనే మహి ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించేస్తాడనీ ప్రచారం జరుగుతోంది. అంటే ఇయర్‌ ఎండింగ్‌ రిలీజ్‌ ప్లాన్‌ చేస్తాడేమో. వెంకీ స్పీడు చూస్తుంటే, ఈ ఏడాది కూడా రెండు సినిమాలతో ఫ్యాన్స్‌ని ఖుషీ చేసేలా ఉన్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS