అక్కడే తిష్ట వేసిన రెజీనా!

మరిన్ని వార్తలు

తెలుగులో 'ఎస్‌ఎమ్‌ఎస్‌' చిత్రంతో ప్రేక్షకులకు హాయ్‌ చెప్పిన ముద్దుగుమ్మ రెజీనా పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించింది. కానీ, స్టార్‌డమ్‌ సంపాదించలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ ఎంజాయ్‌ చేస్తోంది. అప్పుడెప్పుడో 'ఆంఖేన్‌ 2'లో రెజీనా నటిస్తోందనీ, బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌ ఈ సినిమాలో నటిస్తున్నారనీ, ఇలాంటి సినిమాలో నటించే అవకాశం.. అదీ తొలి అవకాశం రావడం తనకెంతో సంతోషంగా ఉందని తెగ సందడి చేసింది రెజీనా. కానీ ఆ సినిమా పరిస్థితి ఏమైందో తెలీదు కానీ, రీసెంట్‌గా ఏక్‌ లడకీ ఖో ఐసా లగా హై' సినిమాతో రెజీనా బాలీవుడ్‌ ఎంట్రీ షురూ అయ్యింది.

 

వన్స్‌ ఎంటర్‌ అయ్యాక ఇక ఊరుకుంటుందా.? నిలదొక్కుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి కూడా. మరో రెండు మూడు కొత్త అవకాశాలు రెజీనా చేతిలో పడ్డాయి. ప్రస్తుతం '18', అనే సినిమాతో పాటు, మరో సినిమాలోనూ రెజీనా నటిస్తోంది. మెల్లమెల్లగా బాలీవుడ్‌లో బిజీ అవుతోన్న రెజీనా ఇక అక్కడే సెటిలైపోయేలా ఉందని అనుకుంటున్నారంతా. అయితే, రెజీనా మాత్రం దక్షిణాది సినిమాలతోనే తాను పాపులర్‌ అయ్యాననీ, దక్షిణాది ప్రేక్షకులను ఎప్పుడూ మర్చిపోననీ, మంచి అవకాశాలొస్తే వదిలిపెట్టననీ చెబుతోంది. చూడాలి మరి, వన్స్‌ బాలీవుడ్‌ వాటర్‌కి అలవాటు పడితే, ఇక తిరిగి రావడం అంత సులువా మరి. చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS